
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
అధిక సంఖ్యలో ఉండే ఎస్‌జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీ ప్రక్రియకు ముందే ప్లస్ 2 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు బదిలీల్లో కొత్తగా మంజూరు చేసిన పోస్టుల ఖాళీలను చూపించాలి.
– పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్
జీరో సర్వీసుతో న్యాయం
బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులందరికీ జీరో సర్వీసు ఇవ్వాలి. రిటైర్మెంట్ వయసు బెనిఫిట్ రెండు నుంచి మూడేళ్లకు పెంచాలి. మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెచ్‌ఎం పోస్టులు పీఎస్ హెచ్‌ఎంలతో భర్తీ చేయాలి. పీఎస్ హెచ్‌ఎంలకు పదోన్నతులు కల్పించాలి. 120కి పైగా ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ఒక పీఈటీ పోస్టు ఇవ్వాలి.
– నరాల కృష్ణకుమార్,
జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ
సీనియారిటీ పాయింట్లను
సరిచేయాలి
డ్రాఫ్ట్స్ రూల్స్‌లో రూపొందించిన ప్రకారం ఏడాదికి ఒక పాయింట్ వంతున సర్వీస్ పాయింట్లు ఇవ్వాలి. తరచుగా వస్తున్న మార్పులతో రేషనలైజేషన్‌కు గురవుతున్న టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి న్యాయం చేయాలి.
– పోతంశెట్టి దొరబాబు,
జిల్లా అధ్యక్షుడు, ఎస్‌టీయూ

మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి

మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి