వివాహితతో పరిచయం.. ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైం చూసి | Man Trying To Kill Lover Over Extramarital Affair Tamil Nadu | Sakshi
Sakshi News home page

వివాహితతో పరిచయం.. ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైం చూసి

Jul 16 2023 3:52 PM | Updated on Jul 16 2023 4:10 PM

Man Trying To Kill Lover Over Extramarital Affair Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: వివాహేతర సంబంధం విషయంలో మహిళకు నిప్పు అంటించి హత్య చేయడానికి ప్రయత్నించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెంగల్పట్టులో సంచలనం కలిగింది. వివరాల్లోకి వెళితే.. చెంగల్పట్టు జిల్లా పాలరు భగత్‌ సింగ్‌ నగర్‌కు చెందిన ప్రతాప్‌ అనే కుళ్లన్‌ (33) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమైంది. అయితే పిల్లలు లేరు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన అరుణ్‌ ప్రకాష్‌ భార్య ప్రియ (27)తో పరిచయం ఏర్పడి వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

వివాహేతర వ్యవహారం ప్రతాప్‌ భార్యకు తెలిసింది. దీంతో ప్రతాప్‌ను వారించింది. కానీ ఈ మాటలు పట్టించు కోకుకుండా ప్రియురాలతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన ప్రతాప్‌ బావ అతని పై దాడి చేశాడు. దీంతో ప్రతాప్‌ ప్రియతో మాట్లాడడం ఆపేశాడు. అయితే తనతో సంబంధం కొనసాగించాలని ప్రియ ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో గురువారం పాలరు రోడ్డులో ప్రతాప్, ప్రియ గొడవ పడ్డారు.

అనంతరం శనివారం ఉదయం ప్రియ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి వెళ్లిన ప్రతాప్‌.. ఆమె పై కిరోసిన్, పెయింట్‌ కొట్టడానికి ఉపయోగించు టర్బెంట్‌ ఆయిల్‌ను రెండు కలిపి పోసి నిప్పంటించాడు. పాలరు సహాయ ఇన్‌స్పెక్టర్‌ కోదండన్‌ ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన ప్రియను చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

చదవండి  భార్య మిస్సింగ్‌ అంటూ 12 మంది భర్తల ఫిర్యాదు.. ఫోటో చూడగానే పోలీసులకు దిమ్మ తిరిగింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement