గుండెపోటుతో అన్నాచెల్లెళ్ల మృతి | Jagtial District: Brother And Sister Death Due To Heart Attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో అన్నాచెల్లెళ్ల మృతి

Sep 13 2023 7:53 PM | Updated on Sep 13 2023 8:57 PM

Jagtial District: Brother And Sister Death Due To Heart Attack - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కోరుట్ల మండలం కల్లూరులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు.

సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల మండలం కల్లూరులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. రంగుల పోషాలు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మోస్రాలో ఉంటున్న చెల్లెలు పోషవ్వ.. అన్న మరణవార్త విని కన్నీటి పర్యంతమై గుండెపోటుతో హఠాన్మరణం చెందింది.

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెను సవాల్‌ విసురుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. విద్యార్థుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు బారిన పడుతున్నారు.
చదవండి: పిల్లలున్నా అతడితో లవ్‌ ట్రాక్‌.. చివరకు..

Advertisement
 
Advertisement
Advertisement