బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు | Forgery Case On BJP MP CM Ramesh In Hyderabad, Know Details About This Case - Sakshi
Sakshi News home page

<script>
document.addEventListener("DOMContentLoaded", function() {
 var newsContent = document.querySelector(".news-story-content");
    var paragraphs = Array.from(newsContent.querySelectorAll("p"));
 
  var firstParagraph = paragraphs.find(function(paragraph) {
       return !paragraph.closest('.bullet_list');
   });
  if (firstParagraph.length > 1) {
   var secondParagraph = firstParagraph[1];

 var script = document.createElement("script");
 script.async = true;
 script.id = "AV62ff84d96d945e7161606a7a";
 script.type = "text/javascript";
 script.src = "https://tg1.playstream.media/api/adserver/spt?AV_TAGID=62ff84d96d945e71…";
 
 secondParagraph.parentNode.insertBefore(script, secondParagraph.nextSibling);
}
});
</script>

బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు

Published Sat, Mar 23 2024 8:02 PM

Forgery Case On Bjp Mp Cm Ramesh In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీనటుడు వేణు ఫిర్యాదుతో బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. పీసీఎల్‌ జాయింట్ వెంచర్ కంపెనీలో ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు సీఎం రమేష్ కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ చేశారు.  కాగా, వేణు తరఫున కావూరి భాస్కర్‌రావు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

పీసీఎల్‌ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడ్డారని కావూరి భాస్కర్ రావు తెలిపారు. ‘‘ఈ ఫోర్జరీకి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వేణు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌లో నమోదైన కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఈ రోజు క్రైమ్ ఏసీపీ నా స్టేట్‌మెంట్ రికార్డు కోసం రమ్మని పిలిచారు. అరగంట పాటు నా స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. కేసుకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది. వేల కోట్ల స్కాంకి  సీఎం రమేష్ పాల్పడ్డాడు సీబిఐ ఎంక్వయిరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని కావూరి భాస్కర్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement