వివాహేతర సంబంధం: ఇంట్లో భర్త నిద్రపోతుంటే ప్రియుడితో కలిసి..

Extra Marital Affair: Wife Assassinated Husband Help Of Lover Hyderabad - Sakshi

ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య 

భార్యతో పాటు మరో నలుగురి అరెస్టు 

సాక్షి,నాగోలు(హైదరాబాద్‌): వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్త వేధిస్తున్నాడని అతడిని ప్రియుడితో కలిసి హత్య చేసింది.  మహిళ, ఆమె ప్రియుడితో పాటు హత్యకు సహకరించిన ముగ్గురిని పహాడీషరీష్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  శనివారం ఎల్‌బీనగర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్‌ ఆదిల్‌ అలియాస్‌ నరేష్‌(35) స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నాడు.

ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్‌ మోయిన్‌బాగ్‌లో ఉంటోంది.అదే ప్రాంతంలో ఉండే సయ్యద్‌ ఫరీద్‌ అలీ అలియాస్‌ సోహైల్‌(27)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భర్త షేక్‌ ఆదిల్‌ ఆమెను తరచూ వేధించేవాడు. ఈ విషయాన్ని జోయా బేగం ప్రియుడు ఫరీద్‌ అలీకి చెప్పగా.. అతడి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు.  

ఇలా అమలు చేశారు... 
ముందే వేసుకున్న పథకం ప్రకారం ఫరీద్‌ అలీ తన స్నేహితులు ముహమ్మద్‌ రియాజ్, షేక్‌ మావియా, మహ్మద్‌ జహీర్‌లతో కలిసి ఈ నెల 19 న రాత్రి జోయాబేగం ఇంటికి చేరుకున్నారు. జోయాబేగంతో పాటు మిగతా నలుగురూ కలిసి ఇంట్లో నిద్రలో ఉన్న షేక్‌ ఆదిల్‌ అలియాస్‌ నరేష్‌ మేడకు చున్నీతో ఉరి బిగించి, కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం షేక్‌ ఆదిల్‌ మృతదేహాన్ని ఆటో ట్రాలీలో పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరి«ధిలోని మామిడిపల్లి రోడ్డుకు తరలించారు. అక్కడ మృదేహంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.

రక్తపు మరకలతో ఉన్న దుస్తులను కూడా మంటల్లో కాల్చిచేశారు. కాగా, కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హతుడు షేక్‌ ఆదిల్‌గా గుర్తించారు. దర్యాప్తులో వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు తేల్చేరు. హత్యలో పాల్గొన్న ఐదుగురినీ అరెస్టు  శనివారం రిమాండ్‌కు తరలించారు.  సమావేశంలో వనస్ధలిపుం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు,  అర్జునయ్య, శ్రీదర్‌రెడ్డి, సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: Khammam: వానజల్లు పడుతోందని బట్టలను తీసుకొచ్చి దండెంపై వేస్తుండగా..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top