లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Thu, May 2 2024 9:17 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 22,647కు చేరింది. సెన్సెక్స్‌ 148 పాయింట్లు దిగజారి 74,631 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.71 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.53 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.34 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.33 శాతం దిగజారింది.

మార్కెట్ అంచనాలకు అనుగుణంగా యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ వరుసగా ఆరో సమావేశంలో  కీలక వడ్డీరేట్లను 5.25-5.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. రెండు రోజుల ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశం తర్వాత నిర్ణయాలు వెల్లడించారు. ద్రవ్యోల్బణం రెండు శాతం చేరేంత వరకు వడ్డీరేట్లలో మార్పులు చేయడం సరికాదని భావిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్‌ఓఎంసీ ఇప్పటి వరకు వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఉండేవి. కానీ తాజా నిర్ణయంతో దీన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement