రిలయన్స్‌ పవర్‌ రూ. 2 వేల కోట్ల ఆస్తుల జప్తు | Reliance Power Assets Seized ED FEMA Case Rs 2033 crore | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ పవర్‌ రూ. 2 వేల కోట్ల ఆస్తుల జప్తు

Oct 15 2026 4:48 PM | Updated on Oct 15 2026 5:13 PM

Reliance Power Assets Seized ED FEMA Case Rs 2033 crore

న్యూఢిల్లీ: విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసు విచారణలో భాగంగా రిలయన్స్‌ పవర్‌ (ఆర్‌పీఎల్‌)కి చెందిన సుమారు రూ. 2,033 కోట్ల అసెట్స్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఆర్‌పీఎల్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు, ససాన్‌ పవర్‌లో షేర్లు వీటిలో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈడీ ఆరోపణల్లో నిజం లేదని, తమ వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని ఆర్‌పీఎల్‌ పేర్కొంది.

బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్, కేమ్యాన్‌ ఐలాండ్స్‌లోని నిర్దిష్ట కంపెనీలకి ఇచ్చిన రూ. 2,101.46 కోట్ల రుణాలను ఆర్‌పీఎల్‌ రైటాఫ్‌ చేయడంపై సెబీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈడీ దృష్టి ఈ కేసుపై పడింది. 2006లో విదేశీ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్ల జారీ ద్వారా రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ (తదుపరి ఆర్‌పీఎల్‌లో విలీనం అయ్యింది) సమీకరించిన 300 మిలియన్‌ డాలర్లలో 275 మిలియన్‌ డాలర్లు ఇందుకోసం దురి్వనియోగం చేసినట్లు ఈడీ ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement