
గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్‌ను కలుసుకోవడం కొంత కష్టమే. అపాయింట్‌మెంట్, టైమ్ వంటి అనేక రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే అనుకోకుండా పిచాయ్‌ను కలుసుకుంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేరు. అలాంటి అనుభవమే ఓ యువకునికి ఎదురైంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో నా సోదరిని.. చూడటానికి వెళ్ళినప్పుడు, కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్‌ను కలుసుకున్నారు. ఆ అనుభూతిని మరపురానిది అని ఆకాష్ అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టును దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. సుందర్ పిచాయ్ ని చూస్తున్నావా.. ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతుడివి అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు సుందర్ పిచాయ్ అద్భుతమైన వ్యక్తి అని అన్నారు.
visited my sister @Google HQ today and ran into the head honcho himself! mr @sundarpichai it was a pleasure, do check out @tryramp 🤝 pic.twitter.com/e0ns2MwdEI
— Akash (@akashtronaut) August 27, 2025