
టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగం.. భారీ వేతనం అయినా అన్నీ వదిలేసిందో ఓ ఉద్యోగిని. గూగుల్ జ్యూరిచ్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేసిన ఫ్లోరెన్స్ పోయిరెల్, ఏడానికి రూ. 3.40 కోట్లు (390,000 డాలర్లు) సంపాదించేవారు. అయినప్పటికీ, ఎక్కువ సమయం తన ప్రియమైన వారితో గడపాలని ఆకాంక్షతో ఆమె ఉద్యోగాన్ని వీడి, జీవితాన్ని మెల్లగా ఆస్వాదించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
"పని మంచిగా అనిపించేది కానీ జీవితం ఇంకా గొప్పది" అని ఫ్లోరెన్స్ చెబుతారు. ఆమె 37 ఏళ్ల వయసులో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది. బర్న్ అవుట్ కాకపోయినా, జీవితం అసలైన అర్థాన్ని తెలుసుకోవాలని ఆమెకు ఆసక్తి పెరిగింది. తన జీవిత భాగస్వామి జాన్ (తన కంటే 17 ఏళ్లు పెద్దవాడు, అతను కూడా గూగుల్ ఉద్యోగే)తో గడిపే సమయం చాలా విలువైనదని ఆమె గుర్తించారు.
2024 నాటికి 1.5 మిలియన్ డాలర్లు (రూ. 12.6 కోట్లు) ఆదా చేసిన ఫ్లోరెన్స్, FIRE (Financial Independence, Retire Early) భావనతో ప్రేరితమై, ఉద్యోగం మానేసి 18 నెలల "మినీ రిటైర్మెంట్" తీసుకుంది. ఈ సమయంలో ఆమె జాన్‌తో కలిసి ప్రయాణాలు చేస్తూ, జీవితాన్ని తానే నిర్ణయించే వేగంతో అనుభవిస్తున్నారు.
ఇప్పుడు ఆమె జ్యూరిచ్ సరస్సులో ఈత కొడుతూ, కెరీర్ కోచింగ్ అందిస్తూ, జీవితం యొక్క అందాన్ని ఆస్వాదిస్తోంది.
"జీవితం చిన్నది, అందమైనది. దానిని మీరు ప్రేమించే వ్యక్తులతో గడపడంమే నిజమైన ఆనందం" అని ఫ్లోరెన్స్ తేల్చి చెప్పింది.