ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు | EPFO ELI Scheme UAN Activation Deadline Extended Till June 30 | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు

Jun 2 2025 2:06 PM | Updated on Jun 2 2025 4:02 PM

EPFO ELI Scheme UAN Activation Deadline Extended Till June 30

ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకానికి సంబంధించి ముఖ్యమైన చర్యల గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మరోసారి పొడిగించింది. ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను యాక్టివేట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోసుకునేందుకు గడువును  జూన్ 30 వరకు పొడిగించింది.

యూఏఎన్ అంటే..
యూఏఎన్ అనేది వేతన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఇచ్చే 12 అంకెల సంఖ్య. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది. వ్యక్తి ఉద్యోగం మారినప్పటికీ ఒకేలా ఉంటుంది. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను ఆన్‌లైన్లో సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి, నిర్వహించడానికి యూఏఎన్ సహాయపడుతుంది.

యూఏఎన్ యాక్టివేట్ చేయడం ఎలా?
ఉద్యోగులు ఆధార్ ఆధారిత ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) ఉపయోగించి తమ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలాగో చూడండి..

  • ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌ను సందర్శించండి.

  • "ఇంపార్టెంట్‌ లింక్స్‌" విభాగం కింద  "యాక్టివేట్ యూఏఎన్" పై క్లిక్ చేయండి.

  • యూఏఎన్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

  • ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్‌కు పర్మిషన్ ఇవ్వడానికి 'అగ్రీ' క్లిక్ చేయండి.

  • మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రావడానికి "గెట్ ఆథరైజేషన్ పిన్" పై క్లిక్ చేయండి.

  • యాక్టివేషన్ పూర్తి చేయడానికి ఓటీపీ ఎంటర్ చేయండి.

  •  మీ యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పాస్వర్డ్ వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement