ఈ రాశివారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది.. మీదే పైచేయి..

Today Horoscope 27 12 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: శు.చవితి ఉ.7.12 వరకు, తదుపరి పంచమి తె.5.02 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం: ధనిష్ఠ రా.8.31 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.3.17 నుండి 4.45 వరకు, 

దుర్ముహూర్తం: ఉ.8.44 నుండి 9.26 వరకు, తదుపరి రా.10.43 నుండి 11.33 వరకు, అమృతఘడియలు: ఉ.10.44 నుండి 11.56 వరకు; రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు; యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు; సూర్యోదయం 6.32; సూర్యాస్తమయం 5.31. 

మేషం: ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: రుణాలు చేయాల్సిన పరిస్థితి. వ్యవహారాలలో ఆటంకాలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: నిర్ణయాలు మార్చుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

సింహం: సన్నిహితుల నుంచి ధనలాభం. పనులలో విజయం. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

కన్య: యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తుల: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రగతి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. పాతమిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.

ధనుస్సు: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ఆసక్తికర సమాచారం. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ  వాయిదా. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: బంధువుల కలయిక. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి.

కుంభం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో వాయిదా. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

మీనం: వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top