Horoscope Today: February 9, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, ఆకస్మిక ధన లాభం

Feb 9 2023 6:45 AM | Updated on Feb 9 2023 9:18 AM

Today Horoscope 09 02 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.చవితి తె.5.24 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి పంచమి, నక్షత్రం: ఉత్తర రా.8.34 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: తె.5.24 నుండి 7.04 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.10.22 నుండి 11.07 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.39 వరకు, అమృతఘడియలు: ప.12.54 నుండి 2.32 వరకు.

సూర్యోదయం :    6.35
సూర్యాస్తమయం    :  5.54
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం :  ఉ. 6.00 నుండి 7.30 వరకు..

మేషం: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. కీలక విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనుల్లో కొంత పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.

వృషభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనుకోని ప్రయాణాలు. రుణదాతల ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అవాంతరాల మధ్య సాగుతాయి.

మిథునం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

కర్కాటకం: కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. ఆకస్మిక ధనలాభం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. బాధ్యతలు అధికం. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: వ్యతిరేక పరిస్థితుల నుంచి బయటపడతారు. విద్యార్థుల ఆశలు నెరవేరతాయి. ఆకస్మిక ధనలాభం. ముఖ్యమైన పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల: పనుల్లో మరింత జాప్యం. అనుకున్న ఆదాయం రాక ఇబ్బంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు ఎంతకీ కొలిక్కి రావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం: నూతన పరిచయాలు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ధనలబ్ధి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం: మానసిక ఆందోళన. పనుల్లో ప్రతిబంధకాలు. రుణదాతల ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. బందువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం: వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement