దినఫలం: ఈ రాశివారికి ఆస్తిలాభం.. మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

Horoscope Today 26 05 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్రవారం మే 26వ తేదీ
సూర్యోదయం: 5.29, సూర్యాస్తమయం: 6.24.
తిథి: శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి ఆష్టమి,
నక్షత్రం: ఆశ్లేష రా.7.01 వరకు, తదుపరి మఖ,

వర్జ్యం: ఉ.6.33 నుండి 8.22 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.54 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.14 వరకు,
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు,

అమృతఘడియలు: సా.5.14 నుండి 6.58 వరకు;

మేషం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. శ్రమానంతరం పనులు పూర్తి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: కాంట్రాక్టులు దక్కుతాయి. పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. పనులు సకాలంలో పూర్తి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల: కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: రాబడి నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మకరం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. విలువైన సమాచారం. వస్తులాభాలు. కొన్ని సమస్యలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. కొత్త కార్యక్రమాలు చేపడతారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top