
Chelluboyina Srinivasa Venugopalakrishna
రామచంద్రపురం: రాష్ట్ర అభివృద్ధిని చూడలేక అడ్డగోలు ప్రకటనలు చేస్తున్న చంద్రబాబునాయుడు రాష్ట్రానికి దౌర్భాగ్యపు ప్రతిపక్ష నేత అని బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి వేణు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అని అందరూ చెబుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేని తనంతో వ్యవహరిస్తున్నారన్నారు.
రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని కళ్లుండి చూడలేక ప్రతిపక్షం, పచ్చమీడియా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి ముగ్గురు మంత్రులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలను పొగుడుతుంటే ఇక్కడి ప్రతిపక్షం మాత్రం ఏదోవిధంగా విమర్ళలు చేయాలని చూస్తోందని మంత్రి వేణు దుయ్యబట్టారు. అభివృద్దిని అడ్డుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పనిచేస్తున్నారన్నారు.