వంగవీటి రాధాపై వింత ఫ్లెక్సీలు.. కూటమిలో కొత్త చిచ్చు | Vijayawada Flexi Row: Is Chandrababu Pushing TDP Leaders Into Jana Sena | Sakshi
Sakshi News home page

వంగవీటి రాధాపై వింత ఫ్లెక్సీలు.. కూటమిలో కొత్త చిచ్చు

Oct 14 2026 11:11 AM | Updated on Oct 14 2026 11:15 AM

Vijayawada Flexi Row: Is Chandrababu Pushing TDP Leaders Into Jana Sena

సాక్షి, విజయవాడ: కూటమి రాజకీయాల్లో ఇదో కొత్త లెక్క!. ఒకవైపు జనసేన సీట్ల కోసం పట్టుబడుతూ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తే.. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం అదే పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల టైంలో జరిగిన తంతే.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసమూ జరుగుతోందన్న చర్చ జోరందుకుంది. 

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరుతారంటూ నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధాను జనసేనలోకి పంపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ చర్చ జోరందుకుంది.

సీట్ల కోసం జనసేన పట్టుబాటు..
కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకం, రాజకీయ ప్రాధాన్యంపై చర్చలు ఎటూ తెగడం లేదు. ఈ నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి తర్వాత జనసేనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆ పార్టీ శ్రేణులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. కూటమిలో తమ పార్టీకి దక్కాల్సిన స్థానాలు, పదవుల విషయంలో పట్టుబడుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.

టీడీపీ నేతలకే జనసేనలో పదవులా?
ఇదే సమయంలో టీడీపీలో ఉన్న నేతలను జనసేనలో చేర్చుకోవడం, వారికి ఆ పార్టీలో పదవులు దక్కేలా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వంగవీటి రాధా పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. జనసేనలోకి టీడీపీ నేతలను పంపిస్తే.. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న నాయకుల రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తంగా విజయవాడలో వెలిసిన ఈ ఫ్లెక్సీలు కూటమి రాజకీయాల్లో కొత్త సందేహాలకు తెరలేపాయి.

జనసేనలో ముసలం! 
విజయవాడ మేయర్‌ సీటు కేటాయింపు వ్యవహారం జనసేన–టీడీపీ కూటమిలో చిచ్చు రేపుతోంది. జనసేనలో మొదటి నుంచీ కొనసాగుతున్న అమ్మిశెట్టి వాసు తనకు మేయర్‌ సీటు కేటాయించాలని పట్టుబడుతుండగా.. వంగవీటి రాధాకు ఆ స్థానం దక్కనుందన్న ప్రచారం ఆయన అసంతృప్తికి కారణమైంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టి, ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ప్రాధాన్యమిస్తున్నారంటూ వాసు తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు రాధా టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరనున్నారన్న ప్రచారం రాజకీయ వేడిని పెంచుతోంది. మేయర్‌ సీటు చుట్టూ మొదలైన ఈ పరిణామాలు జనసేనలో అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి.

ఇదీ చదవండి: ఆమె ఫ్యామిలీకి సీటిస్తే చూస్తూ ఊరుకోం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement