నేడు తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల | Tirumala special entry darshan tickets of Rs 300 released today | Sakshi
Sakshi News home page

నేడు తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

Oct 7 2026 4:44 AM | Updated on Oct 7 2026 4:44 AM

Tirumala special entry darshan tickets of Rs 300 released today

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మో­త్స­వాలకు సంబం­­ధించి అక్టోబర్‌ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో సూచించింది. 

అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మో­త్సవాలతో పాటు పెరటాసి మాసం చివరి వా­రం కావడంతో భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచు­కుని ఈ పది రోజులపాటు ప్రొటోకాల్‌ ప్రము­ఖులకు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగు­లు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్‌­ఆర్‌ఐ, డిఫెన్స్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టో­బర్‌ 10 నుంచి 19 వరకు వీఐపీ బ్రేక్‌ దర్శ­నా­లకు సిఫార్సు లేఖలు స్వీకరించరని పేర్కొంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement