నెక్స్ట్ ఇప్పట్లో లేనట్లే | NMC is being postponed for various reasons | Sakshi
Sakshi News home page

నెక్స్ట్ ఇప్పట్లో లేనట్లే

Nov 30 2025 4:14 AM | Updated on Nov 30 2025 4:14 AM

NMC is being postponed for various reasons

సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్న ఎన్‌ఎంసీ

విద్యార్థులు, విద్యాసంస్థల అభిప్రాయ సేకరణ 

2024 నుంచి ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌లో నెక్ట్‌ ్స నిర్వహిస్తామని 2023లో ప్రకటన 

దీనిలో అర్హత సాధించిన వారికి పీజీలో ప్రవేశం 

పలు కారణాలతో వాయిదా వేస్తున్న ఎన్‌ఎంసీ 

సాక్షి, అమరావతి: వైద్యవిద్యలో ప్రమాణాల పెంపులో భాగంగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ంఎసీ) రూపొందించిన నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్ట్) అమలు ఇప్పట్లో ఉండబోదని తెలుస్తోంది. వచ్చే మూడు, నాలుగేళ్లలో నెక్స్ట్ఉండదని నేషనల్‌ మీడియా తాజాగా రిపోర్ట్‌ చేసింది. వైద్యవిద్యలో ప్రమాణాలు పెంచే చర్యల్లో భాగంగా ఎంబీబీఎస్‌ తుది సంవత్సర విద్యార్థులకు నెక్స్ట్నిర్వహించాలని ఎన్‌ఎంసీ నిర్ణయించింది. రెండుదశల్లో నెక్స్ట్ఉంటుందని 2023లో ప్రకటించడమే కాకుండా, నిర్వహణకు కార్యాచరణ కూడా ప్రకటించింది. 

వైద్య విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి మాక్‌ టెస్ట్‌ నిర్వహణకు అప్పట్లో దరఖాస్తులు ఆహ్వానించారు. 2024 నుంచి నెక్స్ట్నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దీంతో అప్పట్లో విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో మాక్‌ టెస్ట్‌ నిర్వహించకుండానే నెక్స్ట్అమలును ఎన్‌ఎంసీ వాయిదా వేసింది. గతేడాది దాని ఊసే లేకుండాపోయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఫైమా) ప్రతినిధులతో భేటీ సందర్భంగా నెక్స్ట్అమలుపై ఎన్‌ఎంసీ చైర్మన్‌ డాక్టర్‌ అభిజత్‌ శేత్‌ పలు అంశాలను వెల్లడించినట్టు తెలిసింది. 

గతంలో ప్రకటించిన కార్యాచరణ ఇలా
నెక్సట్‌ రెండుదశల్లో ఉంటుంది. మొదటిదశ పరీక్షను మూడురోజులు నిర్వహించనున్నట్టు ఎన్‌ఎంసీ ప్రతిపాదించింది. పూర్తిగా మల్టిపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌ (ఎంసీక్యూ) విధానంలో స్టెప్‌–1లో మెడిసిన్‌ అలైడ్‌ సబ్జెక్ట్స్, సర్జరీ అలైడ్‌ సబెక్ట్స్, ఓబీజీ, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ.. ఈ ఆరు సబ్జెక్ట్‌ల్లో రోజుకు రెండు సబ్జెక్ట్‌ల చొప్పున రోజు విడిచి రోజు నిర్వహిస్తారు. 

మెడిసిన్‌ అలైడ్‌ సబ్జెక్ట్స్, సర్జరీ అలైడ్‌ సబ్జెక్ట్స్, ఓబీజీ ఈ మూడు పేపర్లలో 120 చొప్పున ప్రశ్నలకు మూడుగంటల సమయం, పీడియాట్రిక్స్, ఆప్తమా­లజీ, ఈఎన్‌టీ పేపర్లలో 60 చొప్పున ప్రశ్నలకు గంటన్నర సమయం కాలవ్యవధితో పరీక్షలు నిర్వహి­స్తారు. స్టెప్‌–1 అనంతరం ఆరోగ్య విశ్వవి­ద్యాలయాలు నిర్వహించే ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణు­లవ్వాలి. వీరికి హౌస్‌సర్జన్‌ చేయడానికి అర్హత ఉంటుంది. 

హౌస్‌సర్జన్‌ అనంతరం స్టెప్‌–2 పరీక్ష ఉంటుంది. కాంప్రహెన్సివ్‌ ప్రాక్టికల్‌/క్లినికల్‌ ఎగ్జామి­నేషన్‌ విధానంలో స్టెప్‌–2 నిర్వహిస్తారు. స్టెప్‌–1­లోని ఆరు సబ్జెక్ట్‌లతో పాటు ఆర్థోపెడిక్స్, ఫిజికల్‌ మెడిసిన్‌ రీహాబిలిటేషన్‌ (పీఎంఆర్‌)లో ఎవల్యూ షన్‌ మెథడ్‌లో క్లినికల్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ]

సాధ్యాసాధ్యాలు అంచనా వేశాకే..
ప్రస్తుతమున్న విధానంలో దేశంలో ఎంబీబీఎస్‌ విద్యార్థులు యూనివర్సిటీలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాక పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ పీజీలో అర్హత సాధించాలి. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి­చేసిన వారు మనదేశంలో రిజిస్ట్రేషన్‌ కోసం ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామి­నేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) పాసవ్వాలి. అనంతరం దేశీయ ఎంబీబీఎస్‌ గ్రాడ్యు­యే­ట్‌ల మాది­రిగానే పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ పీజీలో అర్హత సాధించాలి. 

ఇవేవి లే­కుండా ఎంబీబీ­ఎస్‌ ఉత్తీర్ణత, మె­డి­కల్‌ ప్రాక్టీస్‌కు లైసెన్స్, రిజిస్ట్రే­షన్‌కు, పీజీ మెడికల్‌ సీటులో ప్రవేశాలకు నెక్స్ట్అర్హతే ప్రామాణికమని ఎ­న్‌­ఎంసీ ప్రకటించింది. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన వారికి ఈ పరీక్ష ద్వారానే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది. నెక్స్ట్విద్యా­ర్థులు, విద్యాసంస్థల్లో గందరగోళాన్ని నివా­రించడానికి దేశం మొత్తం మాక్‌ టెస్ట్‌లను నిర్వహించాలని ఎన్‌ఎంసీ యోచిస్తోంది. అంతేకాకుండా సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి అభిప్రాయ సేకరణ చేపట్టను­న్నారు. వీటి ఫలితాలను మూల్యాంకనం చేసిన తర్వాతే  నెక్స్ట్అమలుపై తుది నిర్ణయానికి రానున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement