మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు | Former Minister Bandaru Satyanarayana Arrested | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు

Oct 2 2023 8:18 PM | Updated on Oct 2 2023 8:24 PM

Former Minister Bandaru Satyanarayana Arrested - Sakshi

అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి ఆర్‌కే రోజాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  వెన్నెలపాలంలో బండారు స్వగృహంలో బండారును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  

బండారు వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.  సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు, మంత్రి ఆర్‌కే రోజాపై వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు. 400/2023, 41 (A),  41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. బండారుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు గుంటూరు నుండి రాగా, చాలా సేపు నోటీసులు తీసుకోకుండా తలుపు గడియ పెట్టుకున్నారు బండారు. ఎట్టకేలకు తలుపులు బ్రేక్‌ చేసి బండారును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  అదుపులోకి తీసుకున్న బండారును గుంటూరు తీసుకెళుతున్నారు పోలీసులు.

Advertisement
 
Advertisement
Advertisement