breaking news
yusuff ali
-
గల్ఫ్‌లో మరిన్ని ఉద్యోగాలు..
కల్బా: గల్ఫ్ దేశాల్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో అవి మరింత పెరిగే అవకాశం ఉందని లులూ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఏ. యూసుఫ్ అలీ అన్నారు. గల్ఫ్‌లో అవకాశాలు పెరగడం అంటే మలయాళీలకు కూడా మరిన్ని ఉపాధి అవకాశాలు లభించడమేనని పేర్కొన్నారు. కుల, మత భేదాలు లేకుండా అందరికీ ఉపాధి కల్పించే దేశంగా యూఏఈ నిలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.షార్జాలోని కల్బాలో మీడియాతో మాట్లాడిన యూసుఫ్ అలీ.. తన వద్ద చిన్న విమానం, హెలికాప్టర్, పైలట్ ఉన్నారని తెలిపారు. తన దేశానికి లేదా ప్రభుత్వానికి ఎప్పుడైనా వాటి అవసరం ఏర్పడితే అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఇందుకోసం తాను ప్రభుత్వాన్ని ఆశ్రయించి ఎలాంటి ప్రయోజనం కోరబోనని స్పష్టం చేశారు.గల్ఫ్‌లో భారీగా ఉద్యోగాలుఇటీవల ఒక ప్రముఖ కంపెనీ ఉన్నతాధికారితో మాట్లాడిన సందర్భంగా గల్ఫ్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు ఉన్న విషయం తనకు మరింత స్పష్టమైందని యూసుఫ్ అలీ తెలిపారు. ఈ అవకాశాలు భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. దీంతో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న మలయాళీలకు, అలాగే అక్కడ ఉద్యోగాలు కోరుకునే వారికి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదే సందర్భంలో కల్బా వంటి ప్రాంతాల్లో లులూ ఎక్స్‌ప్రెస్ తరహా మరిన్ని సంస్థలను విస్తరించనున్నట్లు కూడా యూసుఫ్ అలీ వెల్లడించారు. కాగా, 2026 ఫిబ్రవరిలో కల్బాలో లులూ కొత్త హైపర్‌మార్కెట్‌ను ప్రారంభించింది. అది యూఏఈలో లులూ గ్రూప్‌కు 122వ స్టోర్‌గా అప్పట్లో మలయాళ మీడియా పేర్కొంది. -
లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు
అప్పు తీర్చలేక ఇంటిని కోల్పోయిన కేరళ మహిళకు లులు గ్రూప్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ అండగా నిలిచారు. ఆమె చెల్లించాల్సిన లోన్ మొత్తాన్ని చెల్లించడమే కాకుండా.. అదనంగా మరో రూ. 10 లక్షలు సాయం చేశారు.కేరళలోని నార్త్ పరవూర్‌కు చెందిన సంధ్య 2019లో ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఖర్చు పెరగడంతో.. మరింత అప్పు చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఆమె భర్త పిల్లలను, తనను వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు.భర్త ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో సంధ్యకు కుటుంబ పోషణ భారమైంది. దానికి తోడు లోన్ చెల్లించడం కష్టతరమైంది. చాలీచాలని జీతంతో ముందుకుసాగుతున్న ఈమె సకాలంలో లోన్ తీర్చలేకపోయింది. దీంతో వడ్డీతో కలిపి మొత్తం అప్పు రూ. 8 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని లోన్ ఇచ్చిన కంపెనీలు ఈమెపై ఒత్తిడి తెచ్చాయి.లోన్ చెల్లించడంలో విఫలమవడంతో లోన్ ఇచ్చిన సంస్థలు ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. కట్టు బట్టలతో.. పిల్లలతో సహా సంధ్య రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఎంఏ యూసఫ్ అలీ కంటపడటంతో.. తక్షణమే స్పందించారు.ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలుసంధ్య లోన్ మొత్తం చెల్లించాలని తన సిబ్బందిని ఆదేశించారు. అంతే కాకుండా వారి జీవితం కొంత సాఫీగా సాగటానికి మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో సంధ్య సమస్యలు తీరిపోయాయి. కష్టాల్లో ఉన్న మహిళకు.. లులు మాల్ అధినేత అండగా నిలబడంతో నెటిజన్లు యూసఫ్ అలీని తెగ మెచ్చుకుంటున్నారు. -
రూ.4000 కోట్లతో షాపింగ్ మాల్.. మూడువేల జాబ్స్
భారతదేశంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను విస్తరించడానికి చైర్మన్ అండ్ ఎండీ 'ఎంఏ యూసఫ్ అలీ' ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు అహ్మదాబాద్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించనున్నట్లు ఈయన పేర్కొన్నారు. దీనికోసం ఇప్పటికే 3,50,000 చదరపు అడుగుల భూమిని సేకరించినట్లు కూడా అలీ వెల్లడించారు.భారతదేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని యూసఫ్ అలీ అన్నారు. ఈ మాల్ నిర్మాణం పూర్తయితే సుమారు 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ షాపింగ్ మాల్ నిర్మించడానికి సుమారు రూ. 4000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, లక్నో, తిరువనంతపురం, కోయంబత్తూరులలో లులు మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో గత ఏడాది లులు మాల్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్.. యూఏఈలోని అబుదాబిలో ప్రధాన కార్యాలయాన్ని కలిగిన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రిటైల్ పరిశ్రమలో ట్రెండ్‌సెట్టర్‌గా పిలువబడుతుంది. ఈ సంస్థ సుమారు 49 దేశాల్లో హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. ఇందులో ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియా, మలేషియా మొదలైన దేశాలు ఉన్నాయి.#WATCH | Kerala: On investment in India, Chairman & Managing Director of Lulu Group International, Yusuffali M. A. says, "...I am very happy to give employment to my fellow citizens...India's biggest shopping mall is in Ahmedabad...I am getting full support from the central… pic.twitter.com/PFsxwVRRu3— ANI (@ANI) September 8, 2024 -
శక్తిమంతమైన భారతీయుల్లో కేరళ వ్యాపారవేత్త
దుబాయ్: మరోసారి కేరళ వ్యాపార వేత్త యూసఫ్ ఆలీ ఎంఏ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గల్ఫ్ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన భారతీయునిగా లాలూ గ్రూప్ డైరెక్టర్ యూసఫ్ తిరిగి ఎంపికైయ్యాడు. ప్రతీ ఏడాది విడుదల చేసే ఈ జాబితాలో యూసఫ్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. దీంతో గల్ఫ్ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన భారతీయునిగా ఐదోసారి ఎంపికైయ్యాడు. ఈ మధ్యనే అబు దుబాయ్ చాంబర్ కు డైరెక్టర్ గా ఎన్నికైన యూసఫ్.. ఏకకాలంలో రెండు ఘనతలు సాధించిన తొలి భారతీయునిగా నిలిచాడు. ఇదిలా ఉండగా 2014 ఫోర్భ్స్ జాబితాలో కూడా యూసఫ్ స్థానం సంపాదించడం విశేషం.


