Waqf properties
-
వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోం
న్యూఢిల్లీ: ఇప్పటికే వక్ఫ్ ఆస్తులుగా పరిగణనలో ఉన్న ఆస్తులను డీనోటిఫై చేయబోమని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మే 5వ తేదీదాకా సెంట్రల్ వక్ఫ్ బోర్డులు, మండళ్లలో నియామకాలు చేపట్టబోమని పేర్కొంది. అయితే వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామంటూ సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనపై మాత్రం కేంద్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం గురువారం సైతం కొనసాగించింది. ఈ సందర్భంగా వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏడు రోజుల్లోపు స్పందన తెలియజేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం కోర్టుకు తెలిపారు. చట్టంలోని సెక్షన్ 9, సెక్షన్ 14 ప్రకారం వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో ఎలాంటి నియామ కాలను కేసు తదుపరి విచారణ తేదీదాకా చేపట్ట బోమని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ‘వక్ఫ్ బై యూజర్’ విధానం ద్వారా వక్ఫ్ ఆస్తులుగా రిజిస్ట్రర్ అయిన, ధృవీకరించబడిన ఆస్తులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డీనోటిఫై చేసి గందరగోళం చేయబోమని ఆయన మాటిచ్చారు. ‘‘ ఎంతో విస్తృతస్థాయి చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని చట్టంగా తీసుకొచ్చాక ప్రభుత్వ వాదన వినకుండానే ధర్మాసనం ఆ చట్టాన్ని నిలుపుదలచేయడం సహేతుకం అనిపించుకోదు. ప్రభుత్వంలో భాగమైన మేము పార్లమెంట్‌కు, ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధనపై తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి?’’ అని మెహతా ప్రశ్నించారు. దీనిపై సీజేఐ ఖన్నా స్పందించారు. ‘‘ 1995నాటి వక్ఫ్ చట్టం ప్రకారం గతంలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న వక్ఫ్ ఆస్తులను ఈ కేసుల తదుపరి విచారణదాకా డీనోటిఫై చేయకూడదు’’ అని కేంద్రాన్ని ఆదేశించారు. గతంలో వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన ఆస్తుల డీనోటిఫైకు వీలుకల్పించే నూతన చట్టంలోని సెక్షన్లను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులకు ప్రతిపాదిస్తామని బుధవారం కోర్టు వ్యాఖ్యానించడం తెల్సిందే.ప్రైవేట్ ఆస్తులనూ వశపర్చుకున్నారుసెక్షన్ల నిలుపుదల ప్రతిపాదనను తుషార్ మెహతా తప్పుబట్టారు. ‘‘ చట్టంలోని సుదీర్ఘ సెక్షన్లను జడ్జీలు హడావిడిగా, యథాలాపంగా చదివి ఉండొచ్చు. చట్టబద్ధ్దమైన సెక్షన్‌ను నిలుపుదలచేయడం నిజంగా అరుదైన విషయం. ఈ విషయంలో ఈ చట్టం పూర్వాపరాలను జడ్జీలు మరోసారి పరిశీలించాలని వేడుకుంటున్నా. అన్ని వర్గాల నుంచి వినతులను స్వీకరించాకే ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తెచ్చింది. వక్ఫ్ పేరిట ప్రైవేట్ ఆస్తులనూ తమ వశం చేసుకున్నారు. కొన్ని చోట్ల గ్రామాల్లోని భూములు మొత్తం వక్ఫ్ పేరిట నమోదై ఉన్నాయి. లెక్కలేనన్ని ప్లాట్లు వక్ఫ్ ఆక్రమణలో ఉన్నాయి’’ అని మెహతా వాదించారు. ‘‘ప్రభుత్వం నుంచి ప్రాథమికస్థాయి స్పందనను అనుమతించకుండానే చట్టంలోని నిబంధనలను నిలుపుదలచేయడమంటే ధర్మాసనం అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోందని అర్థమవుతోంది’’ అని మెహతా అసహనం వ్యక్తంచేశారు. ‘‘ మా వాదనలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లు, పాత శాసనాలను మీ ముందు ఉంచుతాం. మాకు ఒక వారం గడువు ఇవ్వండి. ఈలోపు ఏమీ జరిగిపోదుగా’’ అని మెహతా వ్యాఖ్యానించారు. ‘‘ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వకుండా వారం రోజులు ఆగినంత మాత్రాన ఆకాశం విరిగిపడదుగా’’ అని ఒక రాష్ట్రం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ మీరు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి యతాతథ స్థితిని మార్చకుండా ఉంటే చాలు’’ అని అన్నారు. వక్ఫ్ చట్టం అమలుకాకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే చట్టం మొత్తం పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదని కోర్టు స్పష్టంచేసింది. ‘‘ నూతన చట్టంలోని కొన్ని సెక్షన్లు సమతుల్యతతో ఉన్నాయి. అందుకే మొత్తం చట్టాన్ని నిలుపుల చేయడం అస్సలు కుదరదు. అలా చేయడం సహేతుకం కూడా కాదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున డీనోటిఫై లాంటి వాటి జోలికి పోవద్దు’’ అని ధర్మాసనం సూచించింది.ముగ్గురే వాదించాలి‘‘ఎన్నో పిటిషన్లు వచ్చినా ప్రస్తుతానికి మేం ఐదు పిటిషన్లనే స్వీకరిస్తాం. మీ అందరిలో కేవలం ముగ్గురు న్యాయవాదులనే అన్ని పిటిషన్ల తరఫున వాదించేందుకు అనుమతిస్తాం. ఏ ముగ్గురు వాదించాలో మీరే నిర్ణయించుకోండి’’ అని పలు పిటిషన్ల తరఫు లాయర్లకు సీజేఐ సూచించారు. ఏడు రోజుల తర్వాత కేంద్రప్రభుత్వం స్పందన తెలిపాక ఐదురోజుల్లోపు రీజాయిండర్లను సమర్పించేందుకు పిటిషన్లకు ధర్మాసనం గడువు ఇచ్చింది. మే ఐదో తేదీన ప్రాథమిక స్థాయి అభ్యంతరాలను ఆలకించాక తాత్కాలిక ఉత్తర్వులిస్తామని బెంచ్ తెలిపింది. 1995 వక్ఫ్ చట్టాన్ని, ఆ చట్టానికి 2013లో చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లనూ వేరుగా విచారిస్తామని కోర్టు పేర్కొంది. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, డీఎంకే, ఆకాఫ్ కర్ణాటక రాష్ట్ర బోర్డు మాజీ ఛైర్మన్ అన్వర్ బాషా, సమçస్త కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్ జావేద్, ఢిల్లీ ఆప్ ఎంపీ అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ తదితరులు మొత్తంగా దాదాపు 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేయడం తెల్సిందే. -
టీడీపీ వాళ్లా.. అయితే వదిలేద్దాం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని పలువురు టీడీపీ నేతలు రెచ్చిపోతు న్నారు. వక్ఫ్ భూముల్లో ఎక్కడికక్కడ పాగా వేసి దర్జాగా అనుభవిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కృష్ణా జిల్లా తాడిగడపలోని సర్వే నంబర్ 176లో 12.92 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమించిన ఘనుడు ఈ సంక్రాంతి మూడు రోజులు ‘బరి’ తెగించి కోడి పందాలు నిర్వహించాలనుకుంటే, చివరి ఘడియలో అధికారులు అడ్డుకోవడంతో భంగపడ్డాడు. ఇప్పుడు ఆ భూమిని సాగుకు ఇచ్చేందుకు అధికారులు జనవరి 31న బహిరంగ వేలం నిర్వహిస్తామని ప్రకటించడంతో పెద్దపులిపాకకు చెందిన టీడీపీ నేతలకు అక్రమంగా సబ్ లీజ్‌కు ఇచ్చేశాడు. దీంతో వారు రాత్రికి రాత్రే ఆ భూముల్లో అడ్డగోలుగా వరినాట్లు వేసేశారు. వెంటనే వక్ఫ్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి తహసిల్దార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేస్తే ఇప్పుడేమి చేయలేమని.. తర్వాత చూద్దామని తీరిగ్గా బదులిచ్చారు. ఆక్రమణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎందుకంటే అతనికి టీడీపీ నేతల అండదండలు ఉండటమే కారణం. ఇదే రీతిలో మంత్రి ఫరూక్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న టీడీపీ నేత ఒకరు అనంతపురం మసీదు ఆస్తులను 40 ఏళ్లుగా అడ్డగోలుగా అనుభవిస్తున్నాడు. నిబంధనల ప్రకారం అతను ముతవల్లిగా ఎన్నిక కాకుండానే నియామకం అయినట్టు చెప్పుకొని అధికార దుర్విని యోగానికి పాల్పడుతూ షాపింగ్ కాంప్లెక్స్ లీజుల పేరుతో అక్రమంగా జేబులు నింపుకొంటున్నాడు. ముతవల్లీలకు రాష్ట్ర నాయకుడిగా ఎన్నికైనట్టు ప్రకటించుకుని వక్ఫ్ ఆస్తులను అనుభవిస్తున్న అతనిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, టీడీపీ నేతలు సన్మానాలు చేసి అక్రమాలకు తమ వంతు ఆశీస్సులు అందిస్తుండటం విస్తుగొలుపుతోంది. కడప నాగరాజుపేటలో సర్వే నంబర్ 18లో దర్గాకు చెందిన రూ.కోట్లు విలువైన భూమిని టీడీపీ నాయకుడు ఆక్రమించాడు. ప్రొద్దుటూరులో సుమారు రూ.70 కోట్ల విలువైన సర్వే నంబర్ 305/ఎలో 3.10 ఎకరాలు టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి సోదరుడే ఆక్రమించుకోవడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.బరితెగించి దందాలు..రాష్ట్రంలో 2014–19లో యథేచ్ఛగా సాగిన వక్ఫ్ భూముల ఆక్రమణల పర్వం కూటమి సర్కారు రాకతో మళ్లీ ఊపందుకుంది. వక్ఫ్ భూములపై పచ్చ నేతలు పంజా విసరడంతో అధికారులు అటువైపు చూసే సాహసం చేయలేక పోతున్నారు. కూటమి నేతల ఆశీస్సులతో ఆక్రమించుకున్న భూములను అనుభవించేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ముస్లిం సమాజానికి చెందిన సంస్థలు, సేవకులకు జీతభత్యాలు, విద్యా, వైద్యం వంటి సామాజిక ప్రయోజనాల కోసం శతాబ్దాలు, దశాబ్దాల క్రితం దాతలు భూములు వక్ఫ్ చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో 3,502 వక్ఫ్ సంస్థలకు 65,783.88 ఎకరాల భూమి దానంగా సంక్రమించింది. వాటిలో ఏళ్ల తరబడి ఆక్రమణలపాలైనవి, అన్యాక్రాంతమై అనేక వివాదాల్లో ఉన్నవి, కోర్టు కేసుల్లో 31,594.20 ఎకరాలున్నాయి. ప్రస్తుతం 29,578.21 ఎకరాలు ఎటువంటి వివాదాలు లేకుండా ఉన్నాయి. ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీల నియంత్రణలో ఉన్న ఆస్తులకు సంబంధించి వక్ఫ్ ప్రాపర్టీస్ లీజు నియమాలు–2014ను అనుసరించి వ్యవసాయ అవసరాల కోసం భూములను లీజుకు ఇస్తున్నారు. దానిపై వచ్చే ఆదాయంతో ఆయా సంస్థలను ర్వహిస్తున్నారు. వక్ఫ్ భూములు, సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో ఏడు శాతాన్ని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు నిర్వహణ కోసం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీల ఆధ్వర్యంలో ఈద్గా, దర్గాలు, మసీదులు వంటి సంస్థల నిర్వహణ, సేవకులకు జీతభత్యాలు, ముస్లిం సమాజానికి అవసరమైన సాయం అందించేందుకు ఉపయోగిస్తారు. కాగా, వక్ఫ్ సంస్థలకు చెందిన అనేక షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా వక్ఫ్ బోర్డుకే చెందాలి. అయితే కూటమి నేతల మితిమీరిన జోక్యం, బెదిరింపులతో అసలు లక్ష్యం పక్కదోవ పడుతోంది. ఎన్నికల హామీని అమలు చేసిన జగన్ వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నారు. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ చట్టం–1995 ప్రకారం గత ప్రభుత్వం సర్వే కమిషనర్ ద్వారా నోటిఫై చేయని వక్ఫ్ ఆస్తుల కోసం 2వ సర్వేను నిర్వహించింది. గుంటూరు, కృష్ణాŠ, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సర్వే నిర్వహించి.. 3,295 వక్ఫ్ ఆస్తులను గుర్తించి గెజిట్ నోటిఫికేషన్‌కు చర్యలు చేపట్టింది. గెజిట్ నోటిఫికేషన్ అయిన వక్ఫ్ ఆస్తులను అధునాతన సాంకేతిక పద్దతిలో జీఐఎస్, జీపీఎస్ మ్యాపింగ్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సుమారు 223 వక్ఫ్ భూములు, 3,772 మసీదులు, దర్గాలకు అనుబంధమైన ఆస్తులను మ్యాపింగ్ చేశారు. దీనికితోడు ఆక్రమణల నుంచి 580.32 ఎకరాలను రికవరీ చేయగలిగారు. వక్ఫ్ భూములకు సంబంధించిన రికార్డులను కంప్యూటరీకరణ చేశారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాల వారీగా రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు చొప్పున పెంచి అందించారు.వక్ఫ్ సర్వే నిర్వహించి ఆస్తులు కాపాడాలిరాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. రెండవ సర్వే నిర్వహించి వక్ఫ్ ఆస్తులను ఆక్రమణలను వెలికితీసి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదు. వక్ఫ్ సర్వేను నిర్వహించి దాతలు పెద్ద మనస్సుతో ఇచ్చిన ఆస్తులను కాపాడాలి. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు చేపట్టాలి. – షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ముస్లిం దూదేకుల జేఏసీటీడీపీ డబుల్ గేమ్‌ను ముస్లిం సమాజం గమనిస్తోందివక్ఫ్ సవరణ బిల్లు విషయంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడింది. ముందు నుంచి ముస్లిం సమాజ హితం కోరుతున్న వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలోనూ కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ముస్లిం సమాజం గమనిస్తోంది. ఇప్పటికైనా వక్ఫ్ ఆస్తులు ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.– కాగజ్‌ఘర్ రిజ్వాన్, అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ -
వక్ఫ్ నివేదికకు జేపీసీ ఆమోదం
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులు, బోర్డ్ వ్యవహారాల్లో సంస్కరణలు, పారదర్శకత తేవడమే లక్ష్యంగా మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు(Waqf (Amendment) Bill)ను సమీక్షించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(Joint Parliamentary Committee) ఎట్టకేలకు తమ ముసాయిదా నివేదికను బుధవారం ఆమోదించింది. జేపీసీ 38వ సారి సమావేశమై ముసాయిదా నివేదికను ఆమోదించడం కోసం జరిపిన ఓటింగ్‌లో 15 మంది సభ్యులు నివేదికకు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓట్లేయడంతో బీజేపీ నేత జగదాంబికాపాల్(Jagdambika Pal) నేతృత్వంలోని జేపీసీ ఈ నివేదికను ఆమోదించింది. జేపీసీలో సభ్యులుగా ఉన్న విపక్ష పార్టీల నేతలు ఈ నివేదికపై తమ పూర్తి అసంతృప్తిని వ్యక్తంచేస్తూ నోట్లను సమర్పించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆధునికత సాధించే ఉద్దేశ్యంతోనే గత ఏడాది ఆగస్ట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందని బీజేపీ సభ్యులు చెప్పారు. అయితే ఈ బిల్లు ద్వారా ముస్లింల మతసంబంధ వ్యవహారాల్లో కమలదళం ఉద్దేశపూర్వకంగా కలగజేసుకుంటోందని, వక్ఫ్ బోర్డ్ నిర్వహణ అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటోందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ నివేదికను గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేస్తామని, శుక్రవారం మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు జగదాంబికా పాల్ చెప్పారు. వక్ఫ్ బోర్డులోకి ముస్లిమేతర వ్యక్తులను సభ్యులుగా అనుమతిస్తూ సవరణ బిల్లు తేవడాన్ని విపక్షాలు ప్రధానంగా తప్పుబడుతున్నాయి. ప్రతి పౌరుడికీ తన మత సంబంధ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, మత సంబంధ, దాతృత్వ సంబంధ సంస్థల నిర్వహణపై ఆ మతస్థులకే పూర్తి హక్కు ఉంటుందని విపక్షాలు తేల్చి చెప్పాయి. సవరణ బిల్లుతో ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 26లోని పౌరుల మతస్వేచ్ఛకు భంగం కల్గిస్తోందని ధ్వజమెత్తాయి. నివేదికను ఆమోదించడాన్ని జేపీసీలో కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ తప్పుబట్టారు. ‘‘ రాజ్యాంగం ద్వారా మాకు సంక్రమించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వం తరచూ ఉమ్మడి పౌరస్మృతి గురించి మాట్లాడుతుంది. మరి సభ్యుల విషయానికొస్తే హిందూ ఎండోమెంట్ బోర్డ్‌లో హిందూయేతర సభ్యులు లేరు. అలాగే సిఖ్ బోర్డ్‌లో సిఖ్యేతర సభ్యుడు లేడు. క్రిస్టియన్ బోర్డ్‌లో క్రైస్తవేతర సభ్యుడు లేడు. ఇదే నియమాన్ని ముస్లింలకూ వర్తింపజేయాలిగదా?. ఇదంతా వక్ఫ్ బోర్డ్లను నాశనంచేసే కుట్ర’’ అని మసూద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సవరణల్లో ఒక్కటికూడా వక్ఫ్‌కు మేలుచేసేలా లేవు. సవరణలన్నీ వక్ఫ్ బోర్డ్‌ను నాశనంచేసి, వక్ఫ్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యాన్ని పెంచేలా ఉన్నాయి. ఖాళీ వక్ఫ్ స్థలాలను ప్రభుత్వం లాగేసుకునే ప్రమాదముంది. ముస్లిం ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం ఆమోదించట్లేదు. ఈ సవరణలను మేం తిరస్కరిస్తున్నాం. సవరణలను ఒప్పుకుంటే మేం మా మసీదులను కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఓకే
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులపై రికార్డు నిర్వహించడానికి, వాటి లీజు గడువును 30 ఏళ్లకు పొడిగించడానికి ఉద్దేశించినవక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. దీనిని ఆగస్టు 20న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల వరకు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయడానికి ఎక్కువ ఆదాయాన్ని రాబట్టాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. వక్ఫ్ సవరణ బిల్లు-2010 ద్వారా వక్ఫ్ ఆస్తులను వాణిజ్యపరంగా సరైన క్రమంలో ఉపయోగించడం ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందని మెనార్టీ వ్యవహారాల మంత్రి రహ్మాన్ ఖాన్ చెప్పారు. వీధి వ్యాపారుల రక్షణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం: పట్టణాల్లోని వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు పోలీసులు, ఇతర అధికారుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పిస్తుంది. వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ, వీధి వ్యాపారాల క్రమబద్ధీకరణ బిల్లును గృహనిర్మాణ, పట్టణ దారిద్య్ర నిర్మూలన శాఖ మంత్రి గిరిజా వ్యాస్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ధ్రువీకరణ పత్రాలున్న వీధి వ్యాపారులను పోలీ సులు లేదా ఇతర అధికారులెవరైనా తొలగించలేరన్నారు. యాభయ్యేళ్లకు పైగా ఉన్న మార్కెట్లను సహజమైన మార్కెట్లుగా పరిగణించడంతో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకునే వారి హక్కులను పరిరక్షించేందుకు ఈ బిల్లును తెచ్చినట్లు చెప్పారు. భూసేకరణ బిల్లుకు పార్లమెంటు పచ్చజెండా: చరిత్రాత్మక భూసేకరణ బిల్లుకు గురువారం పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లు గతవారమే లోక్‌సభలో పాస్ అయినప్పటికీ రాజ్యసభలో ఆమోదం సందర్భంగా బుధవారం పలు సవరణలు చేశారు. రాజ్యసభలో బిల్లుకు చేసిన సవరణలకు మళ్లీ లోక్‌సభలోనూ గురువారం ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు.