breaking news
Tigress
-
3 పిల్లలతో కారు ముందుకు పులి.. చూస్తే ఊపిరి ఆగినంత పని..
ముంబై: అడవి సఫారీకి వెళ్లిన ఒక కుటుంబానికి తిరిగి వస్తున్న సమయంలో జీవితాంతం మర్చిపోలేని ఓ దృశ్యం కనపడింది. మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో ఒక ఆడపులి తన మూడు చిన్న పిల్లలతో రోడ్డు దాటుతూ కనిపించింది. ఈ అరుదైన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ అంకుశ్ జిజిల్వార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జులై 15 సాయంత్రం తన కుటుంబం పద్మాపూర్ గేట్ నుంచి తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో సఫారీ కోసం ప్రవేశించిందని ఆయన తెలిపారు. అంకుశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు మొహర్లీ గ్రామం దగ్గరకు చేరుకున్నప్పుడు రోడ్డు పక్కన కొన్ని వాహనాలు నిలిపి ఉండటం చూశారు. మొదట పులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ సాయంత్రం 7.03 గంటలకు అకస్మాత్తుగా ఎత్తైన గడ్డి మధ్య నుంచి ఆడపులి ‘ఛోటీ మధు’ బయటకు వచ్చింది.కొన్ని సెకన్ల తర్వాత గడ్డి మధ్య నుంచి ఒక్కొక్కటిగా దాని మూడు పిల్లలు కూడా బయటకు వచ్చాయి. వీడియోలో ఆడపులి ఎంతో ప్రశాంతంగా తన పిల్లలను రోడ్డు దాటిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న వారంతా మంత్రముగ్ధులయ్యారు.ఈ సమయంలో ఒక బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా ఆడపులి వైపు వెళ్లడం ప్రారంభించాడు. అంకుశ్ వెంటనే తన కారు హెడ్‌లైట్‌ను వెలిగించి అతడిని అప్రమత్తం చేశారు. బైకర్ సమయానికి ఆగి సురక్షితంగా పులికి దూరం పాటించాడు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు.అంకుశ్ స్పందిస్తూ.. అడవి వాతావరణంలో ఇంత దగ్గరగా ఆడపులిని తన మూడు పిల్లలతో చూడటం తమ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవాల్లో ఒకటని తెలిపారు. ఇలాంటి క్షణాలు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తాయని చెప్పారు. Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి Ankush Jizilwar | Chandrapur Today (@ankushjizilwar) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
ఒకప్పటి ఆ రాజసం వేరేలేవల్.. పాపం చివరిక్షణాల్లో ఇలా!
ఎంతటి గొప్పవాడైనా సరే.. చివరి రోజులలో అదే మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు.. సహజ సిద్ధమైన విషయాలనే అనుభవిస్తాడు. ఇది మనిషికి మాత్రమే కాదు.. ఇతర ప్రాణులకూ వర్తిస్తుంది. ఆరోహెడ్ ఠీవిగా అడవిలో అలా నడిచి వస్తుంటే ఒకప్పుడు రాజసం ఉట్టిపడేది. అలాంటి దాని చివరి క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ‘అయ్యో.. పాపం’ అనుకునేలా చేసింది. మొసళ్ల బలం నీటిలోనే. అలాంటిది ఆ నీటి నుంచి మొసళ్లను బయటకు లాక్కొచ్చి మరీ వేటాడే సత్తా ఉన్న పెద్దపులిగా మాతామహి మచ్చ్లీ ఓ పేరుండేది. మరి ఆ మచిలీ మునిమనవరాలిగా.. తాను అలాంటి సత్తా ఉన్నదానినే అని నిరూపించుకుంది ఆరోహెడ్. అదీ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాకే!. Arrowhead (T-84) రాజస్థాన్‌లోని రన్‌థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించిన ఒక ప్రసిద్ధ పులి. జూన్ 19వ తేదీన.. తన 14 ఏళ్ల వయసులో అది కన్నుమూసింది. బోన్ క్యాన్సర్‌తో అది మరణించిందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే.. చనిపోయే కొన్నిగంటల ముందు దాని కూనను మరో టైగర్ రిజర్వ్‌కు తరలించడం పలువురిని కదిలించింది కూడా. ఈలోపు.. ఆరోహెడ్ చివరి క్షణాలను సచిన్ రాయ్ అనే నేచర్ ఫొటోగ్రాఫర్ బంధించారు. లాస్ట్ వాక్ అంటూ ఆయన తన సోషల్ మీడియాలో ఆరోహెడ్ వీడియోను షేర్ చేసింది. ‘‘అది జూన్ 17వ తేదీ. పదమ్ తలాబ్ వద్ద తీసిన వీడియో ఇది. లెజెండరీ టైగ్రస్ ఆరోహెడ్ తన చివరి క్షణాల్లో నరకయాతన అనుభవించింది. అది పసికూనగా ఉన్నప్పటి నుంచి నేను దానిని చూస్తున్నా. View this post on Instagram A post shared by Sachin Rai (@sachin_rai_photography)దాని ధైర్యం, సహనం, పోరాటం.. ఆరోహెడ్ ఎదిగిన ప్రతీ దశ ఒక అధ్యాయమే. కృష్ణ (T-19), మాతామహి మచ్చ్లీ (T-16) వారసురాలిగా రన్‌థాంబోర్ అడవుల్లో తనదైన ముద్ర వేసుకుంది అది. అలాంటిది చివరిక్షణాల్లో.. కొన్ని అడుగులు వేస్తూ కింద పడిపోవడం ఎంతో బాధించింది. అలా అది ఓ చెట్టు కిందకు వెళ్తుండడం.. అదే దాని చివరి క్షణాలు అని నా మనసు చెప్పింది. కాసేపటికే అది ప్రకృతి ఒడిలోకి ఒరిగి శాశ్వత నిద్రలోకి జారుకుంది అని భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారాయన. T-84కు ఆరోహెడ్ అని పేరు పెట్టడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. దాని ఎడమ చెంపపై బాణం ఆకారపు గుర్తు ఉండడం వల్ల అలా పేరు పెట్టారు. రన్‌థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతం జోన్ 2, 3, 4లను ఇది చివరి క్షణాల దాకా తన ఆధీనంలో ఉంచుకుంది. ఫొటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు దీని రాజసానికి ఫిదా అయిపోయేవారు. బోన్ క్యాన్సర్ బారిన పడ్డాక.. చివరిరోజుల్లోనూ ఓ మొసలిని ఎదుర్కొని చంపిన వీడియో కూడా ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది.


