breaking news
Rs 1.5 crore package
-
కోటిన్నర జీతంతో కొత్త ఉద్యోగం.. అంతా AI సాయమే..
ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదు. కానీ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఐదు నెలల పాటు తీవ్రంగా ప్రయత్నించి చివరకు కొత్త కొలువు సాధించాడు ఓ ప్రొఫెషనల్. ఈ ప్రయాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తనకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించాడు. ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతడికి లభించిన కొత్త ఉద్యోగంలో జీతం ఏడాదికి 1,55,000 డాలర్లు (సుమారు రూ.1.48 కోట్లు). దీనికి 15 శాతం వార్షిక బోనస్ అదనం. బోనస్ పూర్తిగా లభిస్తే మొత్తం వార్షిక ప్యాకేజీ సుమారు 1,78,250 డాలర్లు (రూ.1.7 కోట్లకు పైగా) అవుతుంది.పదేళ్ల ఉద్యోగం.. ఒక్కసారిగా లేఆఫ్రెడిట్ పోస్టు ప్రకారం.. ఆ వ్యక్తి ఒకే సంస్థలో దాదాపు పదేళ్లు పనిచేశాడు. ఈ కాలంలో మూడు ప్రమోషన్లు కూడా పొందాడు. అయితే ఫిబ్రవరి చివర్లో అనూహ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. అనంతరం దాదాపు ఐదు నెలల పాటు ఉద్యోగం కోసం ప్రయత్నించినా అనేక చోట్ల తిరస్కరణ ఎదురైంది. కొన్ని ఉద్యోగ ఖాళీలు రద్దు కాగా, మరికొన్ని నియామక ప్రక్రియలు నిలిచిపోయాయి. ఇంకొన్ని పోస్టులను చివరకు సంస్థలోని అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేశారని అతను తెలిపాడు.అతడి ప్రొఫైల్ ప్రధానంగా క్లయింట్ సర్వీసెస్, ముఖ్యంగా ఏజెన్సీ రంగంలో ఉంది. అయితే కొత్త ఉద్యోగం కోసం ప్రాజెక్ట్ మేనేజర్, ఎంగేజ్మెంట్, అకౌంట్ వంటి నాన్-సేల్స్ పాత్రలకు దరఖాస్తు చేశాడు. చివరకు ఏజెన్సీ రంగానికి వెలుపల ఉన్న ఓ సంస్థలో ఉద్యోగం దక్కింది. ఈ ఉద్యోగాన్ని లింక్డ్ఇన్ ద్వారా గుర్తించి దరఖాస్తు చేసినట్లు వెల్లడించాడు. కొత్త పని విధానం హైబ్రిడ్, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందని తెలిపాడు.AIతో ప్రత్యేక ప్రిపరేషన్తన ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో AIని విస్తృతంగా ఉపయోగించినట్లు యూజర్‌కు ఇచ్చిన సమాధానంలో రెడిటర్ చెప్పాడు. ప్రతి ఉద్యోగానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్‌ను AI టూల్‌కి ఇచ్చి, ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి వివరాలను కూడా అందించేవాడు. వారి లింక్డ్ఇన్ ప్రొఫైళ్లలో లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సంభావ్య ప్రశ్నలు, చర్చించాల్సిన అంశాలు సిద్ధం చేసుకునేవాడు. ఇంటర్వ్యూల సంఖ్య పెరిగే కొద్దీ తనలోనూ ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. ఆసక్తికరంగా, చివరకు తనకు ఉద్యోగం వచ్చిన సంస్థలోని పోస్టుకు తాను మొదట్లో అర్హుడిననే నమ్మకం కూడా లేదని వెల్లడించాడు. అయితే రిక్రూటర్‌తో పాటు హైరింగ్ మేనేజర్, ఇతర టీమ్ లీడర్లతో మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలు సాఫీగా సాగడంతో అవకాశం దక్కింది.AIతో ఉద్యోగ వేటలో కొత్త మార్పుఈ వ్యక్తి అనుభవం ఒక్కటే కాదు.. ఉద్యోగ వేటలో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. లింక్డ్ఇన్ 2026 పరిశోధన ప్రకారం, 81% మంది ఉద్యోగార్థులు తమ ఉద్యోగ అన్వేషణలో AIని ఉపయోగిస్తున్నారు లేదా ఉపయోగించాలని భావిస్తున్నారు. అలాగే 48% మంది AI టూల్స్ తమ ఇంటర్వ్యూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఇక క్లచ్ ఇటీవల విడుదల చేసిన మరో సర్వేలో 590 మంది అమెరికన్ ఉద్యోగార్థుల్లో 80% మంది ఉద్యోగ వేటలో AI టూల్స్ ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 86% మంది AI వల్ల ఎక్కువ దరఖాస్తులు పంపగలుగుతున్నామని చెప్పారు. అయితే 93% మంది AIతో రూపొందించిన రెజ్యూమ్‌లు, కవర్ లెటర్లు అభ్యర్థుల మధ్య ప్రత్యేకతను తగ్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. Got an offer!!by u/kml3141 in Layoffs -
కొత్తవారికే కోటిన్నర జీతం.. కానీ ఒక్కటే కండీషన్..
ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు భారీగా కోటిన్నర జీతమిస్తానంటున్నారు అమెరికాకు చెందిన భారత సంతతి పారిశ్రామికవేత్త దక్ష్ గుప్తా. కానీ ఆయన పెట్టిన కండీషన్ ఒక్కటే. అదేంటంటే తన స్టార్టప్‌లో ఉద్యోగంలోకి చేరేవాళ్లు వారానికి ఆరు రోజులు, రోజుకు 12-14 గంటలు (9-9-6 rule) పనిచేయాలి.శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ప్రారంభించిన గ్రెప్టైల్ అనే స్టార్టప్ లో పలు ఉద్యోగావకాశాలను దక్ష్ గుప్తా ఇటీవల ప్రకటించారు. ఆయన ప్రకటించిన జీతం బాగానే ఉన్నా రోజుకు అన్నేసి గంటలు పనిచేయాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా 14 గంటల పని అభిప్రాయంపై ఆయన వెనక్కి తగ్గడం లేదు.సిలికాన్ వ్యాలీలో చాలా మంది ప్రొఫెషనల్స్ వారానికి ఆరు రోజులు.. రోజుకు 12 గంటల షిఫ్టులను ఇష్టపూర్వకంగా చేస్తున్నారని గ్రెప్టైల్ ఫౌండర్ దక్ష్ గుప్తా వాదిస్తూనే ఉన్నారు. ఇప్పటి యువతరం వినోదం కంటే క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారని ‘శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్’ వార్తా సంస్థతో జరిగిన సంభాషణలో పేర్కొన్నారు. తన కంపెనీలో జరుగుతున్న పనుల వేగాన్ని ఆయన ఇదివరకే రాకెట్ ప్రయోగంతో పోల్చారు.ఎంట్రీ లెవల్లో, గ్రెప్టైల్లోని ఉద్యోగులు సంవత్సరానికి 140,000 నుండి 180,000 డాలర్లు (సుమారు రూ .1.2–1.5 కోట్లు) మధ్య బేస్ వేతనం పొందవచ్చు. అదనంగా 130,000 నుంంచి 180,000 డాలర్ల విలువైన ఈక్విటీలను పొందవచ్చు. అదే ఏడేళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌కు అయితే బేస్ వేతనం ఏడాదికి 2,40,000 డాలర్ల నుంచి 2,70,000 డాలర్ల వరకు ఉంటుంది.అయితే అన్నీ ఫుల్ టైమ్ ఆఫీసు ఉద్యోగాలు. అంటే రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోమ్) అవకాశమే ఉండదు. తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చే పనిచేయాలి. ఇక కాంప్లిమెంటరీ మీల్స్, ట్రాన్స్‌స్పోర్ట్ ఫెసిలిటీస్, హెల్త్‌కేర్ కవర్, 401కే కాంట్రిబ్యూషన్ మ్యాచ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. -
ఏడాదికి కోటిన్నర వేతన ప్యాకేజి!
ఐఐటీలో చదవడం అంటేనే అదో పెద్ద కల. ఇక అక్కడ చేరితే చాలు.. భారీ మొత్తంలో వేతనాలు గ్యారంటీ అంటారు. సరిగ్గా ఇలాగే జరిగింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివిన ఓ విద్యార్థికి ఏకంగా ఏడాదికి కోటిన్నర రూపాయల ప్యాకేజితో బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. మొత్తం 27 కంపెనీలు తమ వద్దకు క్యాంపస్ ప్లేస్మెంట్లకు వచ్చాయని, అవి 163 మందికి ఆఫర్లు ఇచ్చాయని, వాటిలో ఇదే అత్యంత ఎక్కువ జీతమని ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారులు తెలిపారు. ఇక స్వదేశీ కంపెనీల్లో అయితే.. అత్యధికంగా 42 లక్షల రూపాయల ప్యాకేజీ వచ్చింది. అమెరికాలోని ఓ కంపెనీ మాత్రం దాదాపు కోటిన్నర.. అంటే, 2.50 లక్షల డాలర్ల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది. అయితే.. ఈ భారీ ఆఫర్ కొట్టేసిన కుర్రాడి పేరు మాత్రం ఐఐటీ అధికారులు వెల్లడించలేదు. దీనివల్ల అతడిపై లేనిపోని ఒత్తిడి పెరుగుతుందని వాళ్లన్నారు. ఇప్పటివరకు ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు ఇంత భారీ ప్యాకేజి రావడం కూడా ఇదే ప్రథమం. ఇక, ఇదే సంస్థలో గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ కూడా చదివారు.


