breaking news
Liquid Petroleum Gas
-
ఆయిల్ కంపెనీల ఎల్పీజీ నష్టాల భర్తీ!
న్యూఢిల్లీ: గత 15 నెలలుగా ద్రవీకృత గ్యాస్ (ఎల్పీజీ)ని తక్కువ రేట్లకు విక్రయించడం వల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాటిల్లిన నష్టాలను భర్తీ చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకోసం సుమారు రూ. 30,000–50,000 కోట్లు సబ్సిడీ ఇచ్చే అవకాశమున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎంత నష్టం (అండర్ రికవరీలు) వాటిల్లింది, దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి అనే అంశాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. 2025–26 బడ్జెట్లో అండర్–రికవరీలకు కేటాయింపులు చేయలేదు. అయితే, ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు పెంచడం ద్వారా అదనంగా రూ. 32,000 కోట్లు సమకూర్చుకుంది. ఇలా అదనంగా వచి్చన ఆదాయాన్నే ఎల్పీజీ అండర్ రికవరీలకి కేంద్రం సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)కు 2024–25లో ఎల్పీజీ విక్రయాలపై సుమారు రూ. 40,500 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అధిక రేట్ల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వమే వంట గ్యాస్ ధరలను నియంత్రిస్తోంది. దీనితో మార్కెట్ రేటు కన్నా తక్కువకి విక్రయించడం వల్ల కంపెనీలకు నష్టం వాటిల్లితే, దాన్ని ఇతరత్రా మార్గాల్లో భర్తీ చేస్తోంది. ఇలా 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 28,249 కోట్ల అండర్ రికవరీలకు గాను రూ. 22,000 కోట్లు సర్దుబాటు చేసింది. -
గ్యాస్ మాఫియా!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ రీఫిల్లింగ్ దందా కుటీర పరిశ్రమను తలపిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ గ్యాస్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అడపాదడపా స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) దాడులు, పోలీసుల కార్డన్ సర్చ్ల్లో అక్రమ గ్యాస్ బండారాలు బహిర్గతమవుతున్నప్పటికీ పౌర సరఫరాల శాఖ అధికారుల్లో మాత్రం చలనం లేదనే విమర్శలున్నాయి. గ్రేటర్ పరిధిలోని పౌరసరఫరాల విభాగానికి ఐఏఎస్ హోదాగల ఒక చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్వో), ఇద్దరు జిల్లా స్థాయి పౌరసరఫరాల అధికారులు, 12 మంది సహాయ పౌరసరఫరాల అధికారులతో పాటు ప్రత్యేక విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ సబ్సిడీ వంటగ్యాస్ పక్కదారి పట్టి మాఫియాకు కాసులు కురిపిస్తోంది. డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్ అవసరాలకు ఉపయోగించడమే మాఫియా వ్యాపారంగా మారింది. నగరం నలుమూలలా పెద్ద సంఖ్యలో గ్యాస్ రీఫిలింగ్ కే ంద్రాలు ఉండగా.. ఎనిమిది ప్రాంతాల్లో మాత్రం పెద్దఎత్తున గ్యాస్ సిలిండర్ల కేంద్రాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. నాచారం, బాలానగర్, మూసాపేట, బోరబండ, ఎల్బీ నగర్, సింగరేణి కాలనీ, మారేడుపల్లి, సంతోషన్గర్ తదితర ప్రాంతాల్లో అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వంట గ్యాస్ పక్కదారి డొమెస్టిక్ వంటగ్యాస్ కంటే కమర్షియల్, వాహనాల్లో నింపే గ్యాస్ ధర అధికంగా ఉండడంతో అక్రమ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. కొందరు వ్యాపారులు ఎల్పీజీ డీలర్ల అండదండలతో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌కు తెరలేపి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్లకు ఆధార్ అనుసంధానం, ఏడాదికి పన్నెండు సబ్సిడీ సిలిండర్ల సరఫరా పరిమితితో గ్యాస్‌కు బాగా డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కై వంటగ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాహనాలు, చిన్న ఐదు కిలోల ప్రయివేటు సిలిండర్లల్లో సైతం అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్నారు. చిన్న సిలిండర్లలో.. మహానగరానికి ఉద్యోగం, చదువుల రీత్యా వలస వచ్చే బ్యాచిలర్స్, విద్యార్థులు అధికంగా ఐదు కిలోల చిన్న సిలిండర్లు వినియోగిస్తారు. వీరికి అధికారికంగా గ్యాస్ కనెక్షన్లు లేని కారణంగా బ్లాక్‌లోనే గ్యాస్ రీఫిల్లింగ్ చేయించడం తప్పదు. దీనిని అదునుగా తీసుకున్న కొందరు వ్యాపారులు గ్యాస్ పరికరాల దుకాణాల వుుసుగులో రీఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్రమ దందా కొనసాగిస్తున్నారు. రీఫిల్లింగ్ సందర్భంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు కూడా లేకపోలేదు.గతంలో కంచన్‌బాగ్, కుషాయిగూడ, విజయనగర్ కాలనీల్లోని రీఫిల్లింగ్ కేంద్రంలో ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు విదితమే. వందకు పైగా రీఫిల్లింగ్ కేంద్రాలు నగరంలో వందకు పైగానే అక్రమ రీఫిలింగ్ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేంద్రాల్లో కిలో గ్యాస్‌కు రూ.100 నుంచి 120లు తీసుకుని రీఫిల్ చేస్తున్నారు. మూడు, నాలుగు చక్రాల వాహనదారులు సైతం 35 శాతం వరకు వంట గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. వారికి రెండు రోజులకు ఒకసారి గ్యాస్ అవసరర కావడంతో అక్రమ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. మొక్కుబడి దాడులు... వంటగ్యాస్ అక్రమ రీఫిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ దాడులు మొక్కుబడిగా మారాయి. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఇటీవల నగర శివారులోని నాచారం సింగం చెరువు తండా సమీపంలోని ఒక కేంద్రంపై దాడులు నిర్వహించి అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌ను బట్టబయలు చేశారు. సుమారు 63 డొమెస్టిక్, 55 కమర్షియల్ సిలిండర్లను సీజ్ చేయడమే కాకుండా 60 రీఫిల్లింగ్ రాడ్స్, తూనికల పరికరాలను సీజ్ చేశారు. కానీ, వంటగ్యాస్ పంపిణీ వ్యవహారాలను నిరంతరం అధికారికంగా పర్యవేక్షించాల్సిన ఫౌరసరఫరాల శాఖ మాత్రం కనీసం పట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఫిర్యాదులు వస్తే కానీ శాఖాధికారుల్లో చలనం కలగడం లేదు. నగర ంలో ఎల్పీజీ గ్యాస్ పరిస్థితి ఇదీ... ఎల్పీజీ సిలిండర్ ప్రభుత్వ ధర అక్రమ రీ ఫిల్లింగ్ కేంద్రాల్లో ధర 14.2 కిలోల డొమెస్టిక్ రూ. 681.00 రూ. 9,50.00 19 కిలోల కమర్షియల్ రూ. 1318.50 రూ.15,00.00 5 కిలోల డొమెస్టిక్ రూ.364.50 రూ. 5,50.00 పోలీసులు నమోదు చేసిన కేసులు 2013 2014 నమోదైన కేసులు 16 141 పట్టుబడ్డ నిందితులు 36 191 సబ్సిడీ సిలిండర్లు 331 986 చిన్న సిలిండర్లు 403 1241 ప్రాపర్టీ సీజ్ రూ.1.43 లక్షలు రూ.18 లక్షలు -
యథేచ్ఛగా అక్రమ రీఫిల్లింగ్ దందా
బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్లు వందకు పైగా అక్రమ కేంద్రాలు! పట్టని పౌరసరఫరాల శాఖ దృష్టి సారించిన ఎస్వోటీ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ రీఫిల్లింగ్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) పోలీసులు అక్రమ రీఫిల్లింగ్ వ్యవహారాలను బహిర్గతం చేసినప్పటికీ సంబంధిత పౌర సరఫరాల శాఖకు కనువిప్పు కలగడం లేదు. గ్రేటర్ పరిధిలో ఐఏఎస్ హోదాగల ఒక చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్వో), ఇద్దరు జిల్లా స్థాయి పౌరసరఫరాల అధికారులు, పన్నెండు మంది సహాయ పౌరసరఫరాల అధికారులుతో పాటు ప్రత్యేక విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ సబ్సిడీ వంటగ్యాస్ పక్కదారి పట్టి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అండదండలతో.. సబ్సిడీ వంట గ్యాస్ కంటే నాన్ సబ్సిడీ, కమర్షియల్ గ్యాస్ ధర రెండింతల నుంచి మూడింతలు అధికంగా ఉండటం అక్రమ వ్యాపారానికి కలిసి వస్తోంది. కొందరు వ్యాపారులు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అండదండలతో అక్రమ రీఫిల్లింగ్‌కు తెరలేపి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్లకు ఆధార్ అనుసంధానం లేకపోవడంతో పాటు ఎడాదికి 12 సబ్సిడీ సిలిండర్ల సరఫరా వెసులుబాటుతో గృహ వినియోగదారులకు పెద్దగా ఆందోళన లేకుండా పోయింది. దీంతో డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కై సబ్సిడీ సిలిండర్లను యథేచ్చగా పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగించడమే కాకుండా.. కమర్షియల్ సిలిండర్లలో సైతం గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేయడం పరిపాటిగా మారింది. మరోవైపు వాహనాల్లో, ఐదు కిలోల ప్రయివేటు సిలిండర్లలో సైతం అక్రమ రీఫిల్లింగ్ విస్తృతంగా సాగుతోంది. ఫలితంగా అక్రమ ‘రీఫిల్లింగ్’ వ్యాపారం వుూడు పువ్వులు ఆరు కాయులుగా విరాజిల్లుతోంది. గ్యాస్ పరికరాల దుకాణాల ముసుగులో.. మహానగరానికి ఉద్యోగం, చదువుల రీత్యా వలస వచ్చే బ్యాచిలర్స్, విద్యార్థులు అధికంగా ఐదు కిలోల చిన్న సిలిండర్లు వూత్రమే వినియోగిస్తారు. వీరికి అధికారికంగా గ్యాస్ కనె క్షన్లు లేని కారణంగా బ్లాక్‌లోనే గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేయక తప్పని పరిస్థితి. దీనిని అదనుగా తీసుకున్న కొందరు వ్యాపారులు గ్యాస్ పరికరాల దుకాణాల వుుసుగులో రీఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పా టు చేసి అక్రమ దందా కొనసాగిస్తున్నారు. రీఫిల్లింగ్ సందర్భంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు కూడా లేకపోలేదు.గతంలో కంచన్‌బాగ్‌లోని ఒక రీఫిల్లింగ్ కేంద్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుం చి చిన్న సిలిండర్‌లో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుం డగాప్రమాదం చోటుచేసుకుంది. అయి నా వీరి తీరు మారలేదు. అధికారుల నిఘా పెరగలేదు. రీఫిల్లింగ్ వ్యాపారం జోరు. మహానగరంలో ఎల్పీజీ రీఫిల్లింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు వందకు పైగానే అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. వంటగ్యాస్ డిమాండ్‌ను ఆసరా చేసుకున్న వ్యాపారులు డొమెస్టిక్ గ్యాస్ కిలో గ్యాస్ ధర రూ.100 నుంచి 120 లు తగ్గకుండా రీఫిల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా 14.2 కిలోల డొమెస్టిక్, 19 కిలోల కమర్షియల్ సిలిండర్లను సైతం రీఫిల్లింగ్ చేస్తూ అధిక ధరకు విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రతి కేంద్రంలో నిరంతరం అక్రమ రీఫిల్లింగ్ ప్రకియ కొనసాగుతూనే ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారు. వురోవైపు మూడు, నాలుగు చక్రాల వాహనదారులు సైతం 20 శాతం వరకు గ్యాస్ సిలిండర్లను వినియోగించడంతో రీఫిల్లింగ్ వ్యాపారులకు డిమాండ్ మరింత పెరిగినట్లయింది. నాలుగు చక్రాల వాహనదారులకు రెండు రోజుల కోకసారి సిలిండర్ రీఫిల్లింగ్ అవసరముంటోంది. దీంతో వ్యాపారం మరింత జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మొక్కుబడి దాడులే.... ఫిర్యాదులు వస్తే కానీ పౌరసరఫరాల శాఖాధికారుల్లో కదలిక కనిపించదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పుడప్పుడు హడావుడిగా దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నా.. అవి కాస్త ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అక్రవు రీఫిల్లింగ్ చే సే కేంద్రాలను వదిలి చిన్న, చిన్న రీఫిల్లింగ్ కేంద్రాలు, చిరు హోటళ్ల పైనే దృష్టి సారించడం అనుమానాలకు తావిస్తోంది. వురికొన్నిప్రాంతాలలో దాడుల కంటే ముందే సమాచారం లీకై అక్రవూర్కులు అప్రమత్తమైపోతున్నారు. వాణిజ్యపరమైన బడా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో బాహటంగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నా పట్టింపు లేకుండా పోయింది. ఇదీ గ్రేటర్లో పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ తీరు. ఈ అక్రమం అధికారులకు కనబడలేదా..? సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వారం రోజుల క్రితం నగర శివారులోని నాచారం సింగం చెరువు తండా సమీపంలోని ఒక గృహంపై దాడులు నిర్వహించగా డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలో అక్రమంగా గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేసే వ్యవహారం బహిర్గతమైంది. సుమారు 63 డొమెస్టిక్, 55 కమర్షియల్ సిలిండర్లను సీజ్ చేయడమే కాకుండా 60 రీఫిల్లింగ్ రాడ్స్, తూనికల యంత్రాలను ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. ఇంత జరిగినా వంటగ్యాస్ పంపిణీ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షించాల్సిన ఫౌరసరఫరాల శాఖ మాత్రం కనీసం పట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది.