breaking news
Employees JAC leader
-
లక్ష మందితో ‘చలో హైదరాబాద్’
సాక్షి, హైదరాబాద్: లక్ష మందితో ఈనెల 10వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల సాధనకు టీజీఈజేఏసీ చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో చలో హైదరాబాద్ వాల్‌పోస్టర్‌ను టీజీఈజేఏసీ ప్రతినిధులతో కలిసి చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా పోరాటం ఆగదు : మారం జగదీశ్వర్ ‘మా పోరాటం రాజ్యాంగబద్ధం. ఉచితాలు అడగడం లేదు. చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో చర్చించిన తర్వాత సీఎం ఇచ్చిన హామీలనే అమలు చేయాలంటున్నాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చాయ్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సంఘ భవనాలకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అది కూడా అమలు చేయడం లేదు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై చర్చించడానికి కార్యదర్శి సమయం ఇవ్వరు. మంత్రులను కలిస్తే తర్వాత మాట్లాడుదాం అంటారు. ఇక ఎవరిని అడగాలి. విధిలేని పరిస్థితుల్లో ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా కొట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని ఉద్యోగులంతా ఏకమయ్యారు. ఇక్కడ యూనియన్లు, రాజకీయాలు లేవు. అందరూ జేఏసీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలి. చలో హైదరాబాద్‌ను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల జేఏసీలతో సమావేశం నిర్వహించాం. ఈ జిల్లాల నుంచి 50 వేల మంది వస్తారని వారంతా చెప్పారు. ఉద్యోగులే కాకుండా భార్య/భర్త, పిల్లలతో కలిసి రావాలని పిలుపునిచ్చాం. వెంట టిఫిన్/స్నాక్స్ తెచ్చకోవాలి. జేఏసీ ఏమీ ప్రొవైడ్ చేయదు’అని జగదీశ్వర్ వ్యాఖ్యానించారు. అనుమతి కోసం చివరి వరకు నాన్చొద్దు : ఏలూరి శ్రీనివాసరావు ‘చలో హైదరాబాద్‌లో భాగంగా ఉద్యోగులంతా ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలి. అక్కడ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు అనుమతి రాలేదు. నాలుగుచోట్ల సభ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఎల్బీ స్టేడియం, ఎనీ్టఆర్ గ్రౌండ్స్, నిజాం కాలేజీ గ్రౌండ్స్, సరూర్‌నగర్ స్టేడియం వద్ద సభ నిర్వహించుకునేందుకు దరఖాస్తు సమరి్పంచాం. ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాటుకు అనుమతి వస్తుందని, ఈ అనుమతి అంశాన్ని తక్షణమే తేల్చాలని, చివరి నిమిషం వరకు నాన్చొద్దు. మూడేళ్లుగా మా డిమాండ్లపై పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి సరైన పరిష్కారం లభించకపోవడంతోనే ఉద్యమిస్తున్నాం. మా సమస్యలపై సీఎం సుముఖంగా ఉన్నా, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఉద్యోగుల ఆవేదనను సీఎం అర్థం చేసుకుని ప్రత్యేక చొరవ తీసుకోవాలి’అని శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు బి.శ్యామ్, ముజీబ్, జి.సదానంద్ గౌడ్, చావ రవి, ఎం.మోహన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రకు కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా: విఠల్
హైదరాబాద్: తన సర్వీసును ఏపీకి కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని తెలంగాణ ఉద్యోగాల సంఘ నేత విఠల్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనలో విఠల్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని కలిసి విఠల్ తన వాదనను వినిపించారు. అందుకు ఉద్యోగుల విభజన తాత్కాలిక ప్రాతిపదికన జరుగుందని.. కాబట్టి కాస్తా ఓపిక పట్టాలని విఠల్ తో సీఎస్ అన్నారు. తనను ఏపీకి కేటాయించొద్దని సీఎస్ కు విఠల్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజన అంతా తప్పల తడకగా ఉందనే విషయాన్ని సీఎస్ దృష్టికి విఠల్ తీసుకువచ్చారు.


