breaking news
Dr. Manmohan Singh
-
మాజీ ప్రధానికి క్రీడాలోకం శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు క్రీడాలోకం నివాళులు అర్పించింది. పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, షట్లర్ సింధు, గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్లు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు. ఆయన సేవల్ని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. –సచిన్ టెండూల్కర్రెస్ట్ ఇన్ పీస్ మన్మోహన్జీ. మీ జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. 2013లో మీతో ముచ్చటించిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. –షట్లర్ పీవీ సింధు మన్మోహన్ సింగ్ మరణవార్త నన్ను తీవ్రంగా బాధించింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక ఆయనతో నేను భేటీ అయ్యాను. ఆయన నాయకత్వం, ప్రధానిగా ఎంచుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలవల్లే భారత్ వృద్ధి సాధించింది. ఆయన సేవలు జాతి ఎన్నటికీ మరువదు. –షూటర్ అభినవ్ బింద్రా నా జీవితంలో నేను కలిసి అతిగొప్ప వ్యక్తుల్లో మన్మోహన్ ఒకరు. దార్శనికతలో ఆయన్ని మించినవారు లేరు. ప్రపంచం గొప్ప జ్ఞానిని కోల్పోయింది. –గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ మన్మోహన్ ప్రధాని మాత్రమే కాదు. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన ఆర్తికవేత్త. ఆయన దూరదృష్టి, ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించాయి. –మాజీ రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ మాజీ ప్రధాని మన్మోహన్ గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్‌ను ప్రగతిపథంలో నిలిపేందుకు అలుపెరగని కృషి చేశారు. బరువెక్కిన హృదయంతో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. –యువరాజ్ సింగ్ -
ఆర్బీఐ ప్రతిపత్తికి విఘాతం తగదు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయం ప్రతిపత్తికి ఎటువంటి విఘాతం కలగనీయరాదని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్థిక మంత్రిత్వశాఖ- ఆర్బీఐ సన్నిహిత సహకారంతో కార్యకలాపాలు నిర్వహిం చాలని సూచించారు. ఆర్థికమంత్రిగా (1991-1996), ఆర్బీఐ గవర్నర్‌గా(1982-85) కూడా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. వడ్డీరేట్లు, కేంద్రం బ్యాంక్ నుంచి కొన్ని అధికారాలను బదలాయించాలన్న ప్రతిపాదనలు తత్సం బంధ అంశాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ-ఆర్బీఐ మధ్య విభేదాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొ న్న మన్మోహన్ ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. అటు ఆర్థికశాఖ, ఇటు ఆర్బీఐ రెండూ అత్యున్నత ప్రాముఖ్యత గలిగిన విభాగాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ, వీటి మధ్య ఎటువంటి విభేదాలూ లేవని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే ప్రకటించిన విషయాన్నీ ప్రస్తావించారు. -
బేర్’మంటున్న మన్మోహన్!
ర్థిక నిపుణుడైన మన ప్రధాని ఆదేశం అనువాదంలో తప్పులు దొర్లి ఉండవచ్చు. ముంబై మీదుగా ‘బుల్’ వెళ్లి ప్రతి స్టాక్ ఎక్స్ఛేంజ్లోను వీరవిహారం చేయాలని ప్రధాని కచ్చితంగా కోరుకుని ఉంటారు. కానీ జరిగింది వేరు. చిరకాలంగా శీతనిద్రలో గడుపుతున్న భయంకరమైన బుల్లి బుల్లి ‘బేర్’లు మేలుకున్నాయి. విజృంభించి ఆర్థిక వ్యవస్థను ఊపిరాడకుండా చేసి, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోపక్క మన రూపాయి సోమరి చింపాంజీలా మారిపోయింది. జారిపోతూనే మధ్య మధ్య గుర్రుమంటూ పడుతూలేస్తున్నా దాని ప్రయాణం పాతాళానికే అన్నది తథ్యం. ఘనత వహించిన 2013 సంవత్సరపు భారతీయ జంతుశాల అదుపు తప్పిపోయినట్టు అనిపిస్తే ఆ తప్పు సంరక్షకులదే. వాళ్లు పునాదితో పాటు, మార్గదర్శనాన్ని కూడా కోల్పోయారు. తనకు తాను సృష్టించుకున్న స్వీయ హననంలో ఏకైక బాధితురాలు ఆర్థిక వ్యవస్థే. దేశంలో రాజకీయ స్థిరత్వం కూడా అంతే దారుణంగా ఉంది. యూపీఏ ప్రభుత్వం ఇటీవలి చర్యలన్నీ అత్యంత వికృతంగా ఉన్నాయి. గతంలో లాగే కాంగ్రెస్ తన పునాదిని కోల్పోవచ్చు. అయితే ఆ పార్టీకి ఉన్న గత అనుభవం దృష్ట్యా పార్లమెంటు సమావేశాలను నిర్వహించడానికి సంబంధించిన డీఎన్ఏ నరనరానా ఉంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు మాత్రం ఆత్మహత్యాసదృశతకు నికార్సయిన పాఠం వంటివి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తనో వెర్రివాడిగానూ గ ణాచారిగానూ కూడా ఏకకాలంలో కనిపించారు. ఆయన వ్యవహారశైలి చిలిపితనం వల్ల కాదనీ, గత రికార్డు చెబుతుంది. కాబట్టి ఒక రోబోలా వ్యవహరించడానికి ఆదేశాలు ఉన్నాయని అనుకోవాలి. ఏ పార్లమెంటు సమావేశాల సంసిద్ధత అయినా ఒక మౌలిక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రాధాన్యాలు సరైనవై ఉండేటట్టు చూసుకోవాలి. యూపీఏ ప్రకటించిన మేరకు ఆహార భద్రత బిల్లు ఆమోదం దాని ప్రాధాన్యం. రాజీవ్‌గాంధీ పుట్టినరోజు ఆగస్టు 20 నాటికి దీనిని అమలులోకి తేవాలని అనుకున్నారు. తర్వాత జరిగే ప్రక్రియ నిజానికి అతి సాధారణమైనదే. సమావేశాలు ప్రారంభమైనపుడు అంతా సజావుగా సాగుతుందని, దానితో మొదటివారంలో బిల్లు ఆమోదం పొందుతుందని కాంగ్రెస్ గట్టినమ్మకంతో ఉంది. ప్రతిపక్షాన్ని కూడా లొంగదీసుకుంది. అది ఇష్టం లేకున్నా తిరస్కరించలేకపోయిం ది. అయిష్టంగానే బిల్లుకు సరేనని ఒప్పుకుంది. దీనికి వేర్వేరు రాజకీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయి. తెరచాపను తాడుతో గట్టిగా కట్టిపెడితే పడవ ప్రయాణం సజావుగా సాగినట్టే అనువైన వాతావరణం సృష్టించుకుని సభను సజావుగా సాగించుకొని ఉంటే సరిపోయేది. కానీ, సోనియాగాంధీ నాయకత్వంలో నడుస్తున్న యూపీఏ, ఆమె నమ్మినబంటు దిగ్విజయ్‌సింగ్ అనూహ్యంగా పెద్ద అలజడికి బాట వేస్తూ తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చారు. ఈ దుమారం తెచ్చిన ధూళితో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మసకబారాయి. తెలంగాణ సమస్య నాలుగు సంవత్సరాల నుంచి నలుగుతోం ది. మరో నాలుగు వారాలు ఆగి ఉంటే ఏమయ్యేది? నిజానికి ఆహార భద్రత బిల్లు ఆమోదం పొందిన తరువాత పార్లమెంటులో ప్రధాని ఆ అంశం మీద ప్రకటన చేసి ఉం డవచ్చు. తరువాత మిగిలినకాలం అంతావృథాగా పోయినా ఈ బిల్లును ఆమోదించడం సులువయ్యేది. ఇక్కడ మిమ్మల్ని తికమక పెట్టే అంశం ఒకటి ఉంది. చాలా అంశాలను గోప్యంగా నడిపించే ప్రభుత్వం బొగ్గు కుంభకోణం ఫైళ్లు గల్లంతయ్యాయన్న అంశం సమావేశాల మధ్యలో చర్చకు రాకుండా ఎందుకు దాచిపెట్టలేకపోయింది? మొన్న నెలలో సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చేసిన ప్రకటన వల్ల పైళ్లు గల్లంతయ్యాయన్న సంగతి బయటపడింది. ఆ కుంభకోణం ఫైళ్లు తనకు అందలేదు కాబట్టి దర్యాప్తు సాగించలేమని సిన్హా బహిరంగంగానే ప్రకటిం చారు. ఆ ఫైళ్లు ఎందుకు గల్లంతయ్యాయో మనందరికీ తెలుసు. బొగ్గు వ్యవహారంలో ప్రభుత్వం పీకల్లోతు అవి నీతిలో కూరుకుపోయి ఉంది. కాంగ్రెస్ పార్టీలో స్టార్ పారి శ్రామికవేత్తలుగా వెలుగొందుతున్న నవీన్ జిందాల్, విజయ్ దర్దాలకు ఈ కుంభకోణంతో ప్రమేయం ఉంది. ఈ ఇద్దరికీ సంబంధించిన ఫైళ్లు కూడా పోయిన వాటిలో ఉన్నాయంటే అది నిగూఢ అంశమేమీ కాదు. ఈ గల్లంతు వ్యవహారం చూస్తే కేసును మూసివేయాలన్న ఉద్దేశంతో జరిగిందేనని అనిపిస్తుంది. ఇది చూడగా చూడగా తస్కర ణ కేసుకంటే మించి దౌష్ట్యానికి సరాసరి సహకరించడమే నని అనిపించకతప్పదు. ఇంకా గుప్పెడు సాకులు చూపిం చి భగవంతుడి దృష్టిలో పాపవిమోచనాన్ని సాధించడం జరిగే పనికాదు. భారతీయ అవినీతి అధ్యాయాన్ని చూడ్డా నికి భగవంతుడికి అంత సమయం మాత్రం ఎక్కడిది? అదీకాక, పార్లమెంటరీ వ్యూహప్రతివ్యూహాల ప్రకా రం చూసినా బొగ్గు శాఖను కూడా నిర్వహిస్తున్న ప్రధాని, పైళ్లగల్లంతు మీద ప్రకటన చేయాలని అనుకున్నారు. ప్రతి పక్షం కోరినట్లు ఆయన ఆ ప్రకటన సకాలంలో చేస్తారని చూశారు. ఫైళ్లు గల్లంతైనట్టు తెలిసిన మొదటి రోజు ఆ ప్రకటన చేసి ఉండాల్సింది. కానీ చేయలేదు. ప్రకటన చేస్తానన్న తన హామీ నిలబెట్టుకోవడానికి నాలుగింట ఒక వంతు కాలం సమావేశాలు అయిపోయే వరకు ఎందుకు ఆగారు? ఇది అర్థంలేని పని. ఆహారభద్రత బిల్లు ఆగిపోవడానికి, ఆమోదించేందుకు జాప్యం చేయాలని ముందు నుంచి అనుకుంటున్న ప్రతిపక్షం కారణం కాదు. కాంగ్రెస్ పార్టీయే కారణం. ఇందుకు కారణం ఏమిటి? ఎవరికీ తెలియదు. ఇంతా చేసినా ఈ దారుణమైన నష్టానికి కారణం దుష్ట ఆలోచన కాదు, అసమర్థత. ఎప్పుడు నిష్ర్కమించాలో తెలియకపోతే అన్ని గమనాలు నిష్ఫలమవుతాయంటారు. అమెరికా వాళ్లనీ, అమెరికా వ్యాపారవేత్తలని బాగా ఇష్టపడతారు కాబట్టి మన్మోహన్సింగ్ ఈ సారూప్యతని బాగానే అర్థం చేసుకోగలరు. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీవ్ బాల్మెర్ తాను వైదొలగుతున్నానని ప్రకటించగానే ఆ సంస్థ షేర్ల ధరలు అమాంతం ఏడుశాతం పెరిగిపోయాయి. ఒకప్పుడు బాల్మెర్ ఆ సంస్థలో పెద్ద హీరోగా వెలుగొందాడు. డాక్టర్ మన్మోహన్సింగ్ ప్రభుత్వం పడిపోగానే మనదేశంలో షేర్ల ధరలు ఎంతమేర పెరుగుతాయో?