breaking news
Diplomatic policy
-
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం..
ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. మరొకటి వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తి. వ్యూహాత్మకంగా చూస్తే ఇద్దరిదీ విడదీయరాని బంధం. కానీ, వ్యాపారం విషయానికి వస్తే మాత్రం నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ చర్చలు కొలిక్కి వచ్చే సమయానికి ఏదో ఒక అడ్డంకి పలకరిస్తూనే ఉంది.అమెరికా విధిస్తున్న కఠినమైన టారిఫ్ రూల్స్ ఒకవైపు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని వాషింగ్టన్ జీర్ణించుకోలేకపోవడం మరోవైపు.. ఈ రెండింటి మధ్య ట్రేడ్ డీల్ దోబూచులాడుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న పేచీ ఎక్కడ? అగ్రరాజ్యం ఆంక్షల నడుమ భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటోంది? ఈ ప్రతిష్టంభనకు గల కారణాలపై ప్రత్యేక విశ్లేషణ..టారిఫ్ యుద్ధం.. అమెరికా అభ్యంతరంభారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు కలిగిన మార్కెట్లలో ఒకటి అని అమెరికా వాదిస్తుంది. ముఖ్యంగా హార్లే డేవిడ్సన్ వంటి బైకులు, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న పన్నులను తగ్గించాలని కోరుతోంది.భారత్ వాదనభారత్ తన దేశీయ పరిశ్రమలను (Make in India) కాపాడుకోవడానికి ఈ పన్నులు అవసరమని చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అని పిలవడం, ప్రస్తుతం మళ్లీ అధికారం చేపట్టాక అదే ధోరణి కొనసాగుతోంది.రష్యా నుంచి చమురు కొనుగోళ్లుఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఇది అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులకు నచ్చలేదు. రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని అమెరికా భావిస్తుండగా భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ(వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి) వైఖరిని స్పష్టం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ భేదాభిప్రాయాలు వాణిజ్య చర్చలపై ప్రభావం చూపుతున్నాయి.జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) హోదాగతంలో అమెరికా భారత్‌కు జీఎస్పీ హోదా ఇచ్చేది. దీని ద్వారా కొన్ని భారతీయ ఉత్పత్తులు సుంకం లేకుండానే అమెరికాలోకి ప్రవేశించేవి. ట్రంప్ మొదటి హయాంలో ఈ హోదాను రద్దు చేశారు. దీన్ని పునరుద్ధరించాలని భారత్ పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం భారత మార్కెట్లలో తమ డెయిరీ, మెడికల్ డివైజ్‌లకు(Stents etc..) మరింత వెసులుబాటు ఇస్తేనే ఆలోచిస్తామని అంటోంది.డేటా గోప్యత, ఈ-కామర్స్ విధానాలుఅమెరికన్ దిగ్గజాలైన అమెజాన్, వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్), గూగుల్ వంటి కంపెనీలు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. భారత్ తీసుకొస్తున్న డేటా లోకలైజేషన్(భారతీయ వినియోగదారుల సమాచారం ఇక్కడే ఉండాలి), ఈ-కామర్స్ నిబంధనలు అమెరికాకు ఇబ్బందికరంగా మారాయి. తమ కంపెనీలకు భారత్ ‘లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్’(పోటీలో ఉన్న అందరికీ సమాన అవకాశాలు కల్పించడం) కల్పించడం లేదని అమెరికా వాణిజ్య శాఖ తరచుగా ఆరోపిస్తోంది.ఫార్మా రంగంలో..అమెరికన్ ఫార్మా కంపెనీలు తమ మందుల పేటెంట్ హక్కుల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ ధరకే జనరిక్ మందులను ఉత్పత్తి చేసే భారత విధానం తమ లాభాలను దెబ్బతీస్తోందని వారి వాదన.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్‌తో ట్రేడ్ డీల్‌ను వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, ట్రంప్ శైలిని పరిశీలిస్తే దీని వెనుక ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.ప్రతికార సుంకాలుభారత్ అమెరికా వస్తువులపై ఎంత పన్ను విధిస్తుందో, అమెరికా కూడా భారత వస్తువులపై అంతే పన్ను విధించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దాంతో 2025 ఆగస్టులో భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 25% రెసిప్రోకల్ సుంకాన్ని విధించింది. భారత్ తన వైపు నుంచి పన్నులు తగ్గించే వరకు ఈ డీల్‌పై సంతకం చేయకూడదనేది ఆయన ఉద్దేశం.క్రూడాయిల్.. ఎస్-400 పేచీఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాలను (S-400 వంటివి) కొనుగోలు చేయడం ట్రంప్‌నకు నచ్చడంలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు భారత్‌పై అదనంగా మరో 25% పెనాల్టీ సుంకాన్ని విధించారు. అంటే ప్రస్తుతం కొన్ని భారతీయ ఉత్పత్తులపై మొత్తం 50% సుంకం అమలవుతోంది. భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికి ఈ డీల్‌ను ఒక ఆయుధంగా వాడుతున్నారు.అమెరికా రైతుల ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ పనిచేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల భారతీయ బియ్యం ఎగుమతులపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు. దీంతో చర్చలు నిలిచిపోయాయి.వ్యక్తిగత ప్రతిష్ఠ, మధ్యవర్తిత్వంకొన్ని విశ్లేషణల ప్రకారం (ఉదాహరణకు: జెఫరీస్ గ్రూప్ నివేదిక), భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కానీ భారత్ దాన్ని సున్నితంగా తిరస్కరించడం ఆయనకు నచ్చలేదని, ఆ అసహనం కూడా వాణిజ్య చర్చల జాప్యానికి ఒక కారణమని భావిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారులకు (MAGA - Make America Great Again) తాను ఇతర దేశాలతో వాణిజ్యం పరంగా ఒక కఠినమైన బేరసారాలాడే వ్యక్తి(Tough Negotiator) అని నిరూపించుకోవాలి. భారత్‌తో అరకొర ఒప్పందం చేసుకుంటే అది తన రాజకీయ ఇమేజ్‌కు దెబ్బని ఆయన భావిస్తున్నారు. భారత్ నుంచి భారీగా రాయితీలు పొందితేనే అది తనకు రాజకీయంగా విజయం అని ఆయన నమ్ముతున్నారు.ప్రస్తుత పరిస్థితిఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తిగా ఆగిపోలేదు. ఇటీవల కూడా అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్‌లో పర్యటించింది. అమెరికా పట్టుబడుతున్న మొక్కజొన్న (Corn), సోయా వంటి ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇరు దేశాలు ఈ విషయంలో ఒక అంగీకారానికి వస్తే 2026 ప్రారంభంలో ఈ సుంకాలు తగ్గే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే.. -
యూఎస్ బెదిరించినా తగ్గేదేలే
రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మరోసారి స్పష్టమైన వైఖరి ప్రకటించింది. రష్యా చమురు కొనుగోళ్లపై యూఎస్ నుంచి పదేపదే హెచ్చరికలు, ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ధరలు అనుకూలంగా ఉన్నంత వరకు రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపడానికి భారత్ సుముఖంగా లేదని తేల్చి చెప్పింది. ఈ వైఖరిని భారత్ తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన సార్వభౌమాధికారంగా చూస్తుందని తెలిపింది. దీన్ని ఇతర దేశాలు భౌగోళిక రాజకీయ ధిక్కారంగా కాకుండా ఆర్థిక అవసరంగా చూడాలని పేర్కొంది.ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) క్లిష్టతరంరష్యా చమురుపై భారతదేశం తీసుకున్న వైఖరి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) చర్చలను మరింత క్లిష్టతరం చేసింది. భారత్ మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతిని యూఎస్ రష్యా ఇంధన సంబంధాలతో ముడిపెట్టింది. దీని ఫలితంగా భారత్ నుంచి యూఎస్ వచ్చే కొన్ని వస్తువులపై ఈ సంవత్సరం ప్రారంభంలో విధించిన భారీ సుంకాలను 50% వరకు పెంచింది. వీటిని తగ్గించేందుకు అమెరికా నిరాకరిస్తోంది. రష్యా చమురు సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ సుంకాలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం!యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ వంటి అధికారులు రష్యాతో ఆర్థిక సంబంధాలను కొనసాగించే దేశాలపై మరింత కఠినమైన ప్రకటనలు చేస్తూ భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాలకు ‘ఫిక్సింగ్’ అవసరమని హెచ్చరించారు. ఈ ఒత్తిడికి ప్రతిస్పందనగా భారతదేశం తన దౌత్యపరమైన, ఆర్థిక ఎంపికలను విస్తరిస్తోంది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ న్యూయార్క్‌లో బ్రిక్స్ విదేశాంగ మంత్రులకు ఆతిథ్యం ఇచ్చారు. ఇండియా ఆర్థిక నిబద్ధతను బలోపేతం చేయడం ఈ వ్యూహంలో భాగం. భారత్ గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలను పెంపొందించడం, కొత్త వాణిజ్య కారిడార్లను అన్వేషించడం ద్వారా యూఎస్ ఒత్తిళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. -
8 రోజుల్లో మరో పాక్ అధికారి ఔట్
న్యూఢిల్లీ: భారతీయులను పలు విధాలుగా ప్రలోభపెట్టి గూఢచర్యానికి వినియోగించుకున్నాడన్న నేరానికి మే 13న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిని భారత్ బహిష్కరించిన 8 రోజులకే మరో ఉద్యోగిపైనా భారత్ అదే వేటు వేసింది. అధికార విధులను మీరి ప్రవర్తిస్తున్నాడని, హోదాకు తగ్గట్లు ప్రవర్తించట్లేడనే కారణంగా 24 గంటల్లోపు భారత్‌ను వీడాలని బుధవారం ఆదేశించింది. ఈమేరకు పాక్ హైకమిషన్‌లో సంబంధిత వ్యవహారాల ఉన్నతాధికారి సాద్ వరాయిచ్‌కు ‘అధికారికంగా దౌత్య నిరసన’ నోటీసును అందజేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
భారత్‌లో దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్
ఖలిస్తానీ సానుభూతిపరుడు హర్‌ప్రీత్‌సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు రోజురోజుకీ మరింత ముదురుతున్నాయి. భారత్, కెనడా దౌత్యపరమైన వివాదంలో ఇతర దేశాల ప్రమేయం పెరగడంతో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లోని 41 మంది దౌత్యవేత్తలను కెనడా వెనక్కి రప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్ కల్పించుకొని కెనడాకు మద్దతుగా నిలిచాయి. కెనడా దౌత్యపరమైన ఉనికిని తగ్గించాలని భారత ప్రభుత్వం పట్టుబట్టవద్దని కోరాయి. ‘భారత్‌లో కెనడా తమ దౌత్యవేత్తలను తగ్గించాలని ఢిల్లీ ఆదేశించడం, ఈ మేరకు కెనడా తమ దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించడం ఆందోళన కలిగిస్తోంది.’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. చదవండి: భారత్ చర్యతో లక్షల మంది జీవితాలు దుర్భరం: ట్రూడో ‘క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించడానికి దౌత్యవేత్తలు అవసరం. దౌత్య సిబ్బందిని తగ్గించాలని పట్టుబడ్డవద్దని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే నిజ్జర్ హత్య విషయంలో కెనడా దర్యాప్తుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం భారత్ తన బాధ్యతలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. కెనడా ఆరోపణలో తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. తామకు భారత్‌తో సంబంధాలు అత్యంత కీలమని చెబుతూ.. ఖలీస్తానీ ఉగ్రవాది హత్య విచారణలో కెనడాకు సహకరించాలని న్యూఢిల్లీపై ఒత్తిడి తెస్తున్నాయి. యూఎస్ బాటలోనే బ్రిటన్ నడుస్తోంది. కెనడా విషయంలో భారత్ వైఖరిని తప్పుబడుతూ శుక్రవారం బ్రిటన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పదుల సంఖ్యలో కెనడా దౌత్యవేత్తలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మేము ఏకీభవించడం లేదని బ్రిటన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. కెనడా దౌత్య వేత్తల ఏకపక్ష తొలగింపు, వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణం కాదని అభిప్రాయపడింది సిక్కు వేర్పాటువాది, కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా దౌత్యపరమైన సంఖ్యను తగ్గించుకోవాలని భారత్ గత నెలలో కోరింది. భారత్ విధించిన డెడ్‌లైన్ ముగియడంతో కెనడా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అంతేగాక చండీగఢ్, ముంబై, బెంగళూరు నగరాల్లోని కాన్సులేట్లలో వ్యక్తిగత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా శుక్రవారం తెలిపింది. -
రొట్టె ముక్క... దుడ్డు కర్ర
‘విభజన-అభివృద్ధి’ చైనా సరికొత్త దౌత్యనీతి. గడ్డు సమస్యలన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక సహకారంతో అభివృద్ధిని సాధించాలనేది వియత్నాంతో చైనా తాజా దౌత్య విధానం. అదే ‘విభజన-అభివృద్ధి’ అంతరార్థం. ‘అభివృద్ధి’ దౌత్యాన్ని కాదంటే నోటి ముందున్న రొట్టె ముక్క అదృశ్యమై దుడ్డు కర్ర ప్రత్యక్షమౌతుంది. ‘విభజించి పాలించు’ తెల్లోడి కూట నీతి. ‘విభజన-అభివృద్ధి’ చైనా సరికొత్త దౌత్య నీతి. ఆ దౌత్యం వియత్నాం ప్రధాని గుయెన్ టాన్ డుంగ్పై వశీకరణ మంత్రంలాగా పనిచేసినట్టుంది. చైనా దురాక్రమణకు గురై స్వతంత్రం కోసం పోరాడిన గత చరిత్ర ను వియత్నమీయులు నేటికీ మరవలేదు. పైగా 1979లో కూడా చైనా ఆ దేశంపై దురాక్రమణకు పాల్ప డింది. నదీ జలాల నుంచి దక్షిణ చైనా సము ద్ర జలాల వరకు అడుగడుగునా వియత్నాం పై చైనా ఆధిపత్యవాద ధోరణిని ప్రదర్శిస్తోంది. ఈ నెల 15న చైనా ప్రధాని లీ కెగియాంగ్ వియత్నాంలో పర్యటించారు. అవి రెండూ చిరకాల మిత్ర దేశాలనిపించేలా లీ పర్యటన సాగింది. అనూహ్యమైన ఈ మార్పునకు కారణం చైనా నూతన నాయకత్వమేనని అనుకుంటే పొరపాటు. అది చైనా దౌత్య మాయాజాలం. గడ్డు సమస్యలన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక సహకారంతో అభివృద్ధిని సాధించాలనేది వియత్నాంతో చైనా తాజా దౌత్య విధానం. అదే ‘విభజన-అభివృద్ధి’ అంతరార్థం. అతి సరళమైన చెల్లింపుల పద్ధతిలో సకల రంగాల్లో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించడానికి లీ చొరవ చూపడం వియత్నాం ప్రధాని డుంగ్ను చిత్తు చేసింది. 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి, భారీ ఎత్తున చైనా వియత్నాంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుది రాయి. మౌలిక సదుపాయాల నిర్మాణానికి వియత్నాంకు తక్షణం అవసరమైన 100 కోట్ల డాలర్ల సహాయాన్ని కూడా చైనా అందిస్తోంది.ై పెగా వివాదాస్పదమైన స్ప్రాట్లీ, పార్సెల్ దీవులకు కూడా ఈ ‘అభివృద్ధి’ విస్తరిస్తుంది. అమెరికా, జపాన్‌లు ఇవ్వలేని వరాలను ఆధిపత్యశక్తిగా వ్యవహరించే చైనా ఇస్తుంటే డుంగ్ ఎందుకు కాదనాలి? ఏకైక అగ్రరాజ్యం అమెరికాది బాంబుల దౌత్యం లేదా ‘గన్‌బోట్ డిప్లమసీ.’ బెదిరిం చడం లొంగకపోతే బాంబులు కురిపించడమే తప్ప మరొకటి దానికి తెలియదు. ఇరాక్ ఆ దౌత్య నీతికి భీకర నిదర్శనం. అమెరికా దౌత్య ఆయుధాగారంలో ‘దుడ్డుకర్ర, రొట్టెముక్క’ కూడా లేకపోలేదు. అయితే అది రొట్టెముక్క విసరాడనికి ముందే... దుడ్డుకర్ర భయానికి దాని కోరికలన్నిటినీ నెరవేర్చక తప్పదు. చైనా అందుకు విరుద్ధంగా రొట్టెముక్కలు ముందుగానే ఇచ్చి కావాలనుకున్నది సాధిస్తోంది. బాంబుల దౌత్యంతో అమెరికా ప్రపంచాధిపత్యాన్ని నెరపుతుంటే చైనా వాణిజ్య, పెట్టుబడుల సేనలతో ఆ ఆధిపత్యానికి నిచ్చెనలు వేస్తోంది. వాణిజ్యపరంగా, ఆర్థికంగా తమపై ఆదారపడ్డ దేశాలు రాజకీయంగా తమకు అనుకూలంగా లేదా తటస్థంగా వ్యవహరించ క తప్పదనేది చైనా తర్కం. దక్షిణ చైనా సముద్రంలోని సుసంపన్నమైన కర్బన ఇంధన వనరుల కోసం కాకపోతే చిన్నా చితక దీవులపై చైనా ‘చారిత్రక హక్కుల’ ప్రకటన మరెం దుకు? ఆర్థిక సహకారం, అభివృద్ధి పేరిట ‘శాంతియుతంగానే’ ఆ హక్కులు సమకూరితే మరేం కావాలి? గత ఏదాది వియత్నాం తీరంలో భారత చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) చేపట్టిన చమురు అన్వేషణపై చైనా తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. నాటి ఉద్రిక్తతల మధ్య చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’... ‘భారత చర్యలు చైనా సహనం హద్దులు దాటేంత వరకు నెడుతున్నాయి’ అని హెచ్చరించింది. చివరకు ‘రాజ కీయ కారణాల వల్ల’ వియత్నాం ఓఎన్జీసీతో ఒప్పందాన్ని రద్దు చేసింది. అదే టోంకిన్ అఖాతంలో చమురు అన్వేషణ, వెలికితీత కాంట్రాక్టులను చైనాకు కట్టబెట్టింది! వియత్నాం రావటానికి ముందు లీ ‘ఆసియాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్) సమావేశాలకు హాజరయ్యారు. ఆసందర్భంగా బ్రూనీలో కూడా లీ ‘రొట్టె ముక్కలను’ పంచారు. అభివృద్ధి ఆశను చూపి దీర్ఘకాలిక సహకారానికి పునాదులు వేశారు. మొత్తంగా దక్షిణ చైనా సముద్రప్రాంతం అంతటికీ చైనా ఇదే దౌత్యాన్ని విస్తరింపజేస్తోంది. చైనా దుడ్డు కర్రను దాచేసిందే తప్ప వదిలేయలేదు. ‘అభివృద్ధి’ దౌత్యాన్ని కాదం టే నోటి ముందున్న రొట్టె ముక్క అదృశ్యమై దుడ్డు కర్ర ప్రత్యక్షమౌతుందని తెలిసేట్టు చేసింది. వియత్నాంతో హనీమూన్‌లా సాగిన తన పర్యటనలో లీ... ద్వైపాక్షిక సమస్యలను ‘అంతర్జాతీయం చేస్తే సహించేది లేదని’ హెచ్చరించారు. చైనాను ఏకాకిని చేయడానికి అమెరికా, జపాన్‌లు రచిస్తున్న సైనిక వ్యూహా లకు దూరంగా ఉండాలని అంతరార్థం. - పిళ్లా వెంకటేశ్వరరావు


