breaking news
digitisation
-
హెచ్ఎస్బీసీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీష్ కుమార్
ముంబై: భారత దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ది హంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్ఎస్బీసీ) తమ సంస్థకు స్వతంత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీష్ కుమార్‌ను నియమించింది. ఆయన గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చైర్మన్‌గా పనిచేశారు. కాగా, రజనీష్ 40 సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. ఆయన గతేడాది అక్టోబరులో రిటైర్ అయ్యారు. ఆయన గ్లోబల్ బిజినెస్, బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఎస్బీఐలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చారు. బ్యాంకింగ్‌ను డిజిటలైజేషన్లో వైపు తీసుకురావడంతో తీవ్రంగా కృషిచేశారు. ఎస్బీఐ నుంచి రిటైర్ అవ్వకముందు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కు చైర్మన్‌గా పనిచేశారు. అదేవిధంగా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ ఆసియా ప్రైవేటు లిమిటెడ్ సీనియర్ సలహదారుగా, సింగపూర్ లిమిటెడ్, ముంబైలోని కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్‌కు సలహదారుగా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఎస్బీసీతో పాటు లార్సెన్ అండ్ టూబ్రో ఇన్షోటెక్ లిమిటెడ్ స్వతంత్ర డైరెక్టర్, బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ, ఆసియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీనియర్ సలహదారుగా పని చేస్తున్నారు. సింగపూర్ లిమిటెడ్, ముంబైలోని కోటక్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ సలహాదారుగా కూడా సేవలందిస్తున్నారు. చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! -
నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ గాడిలోకి..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి బలంగా సమర్థించుకుంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత క్రమబద్ధమయిందని, పన్ను పరిధి విస్తృతమైందని, డిజిటైజేషన్‌కు సైతం దారితీసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దీంతో పేదల ఆర్థిక స్థితుల్లో వృద్ధి, మౌలిక సదుపాయాల కోసం మరిన్ని నిధులను వినియోగించే అవకాశం ప్రభుత్వానికి లభించిందన్నారు. భారత్ వరుసగా ఐదో ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గుర్తింపును సొంతం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై విమర్శలు చేస్తున్న వారు తప్పని తేలిందన్నారు. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘డీమోనిటైజేషన్ ప్రభావం’ పేరుతో అరుణ్ జైట్లీ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఎన్డీఏ ప్రభుత్వం తొలి నాలుగేళ్ల పాలనలో ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య... 2014 మేలో ఉన్న 3.8 కోట్ల నుంచి 80 శాతం పెరిగి 6.86 కోట్లకు చేరింది. మా ఐదేళ్ల పాలన ముగిసే నాటికి పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపు అవుతుందనే నమ్మకం ఉంది. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం వల్ల ఆర్థిక రంగం మరింత క్రమబద్ధమయింది. ప్రభుత్వానికి మరింత ఆదాయం, మరిన్ని వనరులు అందుబాటులోకి వచ్చాయి. సాధించిన గొప్ప విజయాలు ఇవే. జీఎస్టీ అమలు చేయడంతో ఇప్పుడు పన్నుల ఎగవేత కూడా క్లిష్టతరంగా మారింది. జీడీపీలో పరోక్ష పన్నుల ఆదాయం జీఎస్టీకి ముందు 4.4 శాతంగా ఉంటే, అది ఆ తర్వాత 5.4 శాతానికి పెరిగింది’’ అని జైట్లీ వివరించారు. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో వ్యవస్థలో రూ.15.41 కోట్ల ధనం చలామణిలో ఉండగా, వీటిని రద్దు చేయడంతో, ఇందులో 99.3 శాతం అంటే రూ.15.31 లక్షల కోట్ల మేర బ్యాంకుల్లోకి వచ్చిన విషయం గమనార్హం. రూ.10,720 కోట్లు మాత్రమే తిరిగి రాలేదు. దీంతో నల్లధనం నియంత్రణ కోసమంటూ కేంద్రం తీసుకున్న చర్యపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తాజాగా కూడా విమర్శలు చేసింది. ఈ విమర్శలపై జైట్లీ స్పందిస్తూ... ‘‘డీమోనిటైజేషన్‌తో మన ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. భారత్ వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. డీమోనిటైజేషన్‌తో 2 శాతం వృద్ధి రేటు పడిపోతుందని అసత్యవాదులు చెప్పినవి తప్పని నిరూపించింది’’ అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ చర్యల తాలూకూ సానుకూల ప్రభావాలు రానున్న సంవత్సరాల్లో మరింత ప్రస్ఫుటిస్తాయని, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని జైట్లీ అభిప్రాయపడ్డారు. మ్యూచువల్ ఫండ్స్‌లోకి డీమోనిటైజేషన్‌తో వ్యవస్థలోని మొత్తం డబ్బంతా బ్యాంకుల్లోకి చేరిందన్న విమర్శలపై జైట్లీ స్పందిస్తూ... డబ్బును స్వాధీనం చేసుకోవడం డీమోనిటైజేషన్ ఉద్దేశం కాదన్నారు. ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, పన్నులు చెల్లించేలా చేయడమే ఉద్దేశాలుగా తెలిపారు. బ్యాంకుల్లో రద్దయిన పెద్ద నోట్ల జమతో, వారి తెలియని ఆదాయ వనరులను గుర్తించే అవకాశం ప్రభుత్వానికి లభించిందన్నారు. ఈ విషయంలో 17.42 లక్షల అనుమానాస్పద ఖాతాదారుల వివరణ సరిగా లేదని కూడా చెప్పారు. ‘‘బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాల్సి రావడంతో పన్ను రిటర్నులు దాఖలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 6.86 కోట్లకు చేరింది’’ అని వివరించారు. నగదు నుంచి డిజిటల్ లావాదేవీలకు మారడం కోసం వ్యవస్థలో కదలిక రావాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల అధిక పన్ను ఆదాయం, పన్ను చెల్లింపుదారులు పెరిగేందుకు దారితీస్తుందన్నారు. బ్యాంకుల్లో భారీ డిపాజిట్లతో వాటి రుణాలిచ్చే శక్తి ఇనుమడించిందని కూడా జైట్లీ చెప్పారు. చాలా డబ్బు మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడుల్లోకి మళ్లిందన్నారు. 2017–18లో పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారు 6.86 కోట్లు ఉన్నారని, అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 25 శాతం ఎక్కువని తెలిపారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ నాటికి 5.99 కోట్లు దాఖలయ్యాయని, 54 శాతం పెరుగుదల ఉందని చెప్పారాయన. రూపే, యూపీఐల జోరు అంతర్జాతీయ పేమెంట్ గేట్వేలు (చెల్లింపుల వ్యవస్థలు) అయిన మాస్టర్‌కార్డ్, వీసాలు మార్కెట్ వాటాను కోల్పోతున్నాయని అరుణ్ జైట్లీ చెప్పారు. దేశీయంగా రూపొందించుకున్న రూపే, యూపీఐ వ్యవస్థల ద్వారా జరిగే లావాదేవీలు... మొత్తం క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీల్లో 65 శాతానికి చేరాయన్నారు. నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నారు. రెండు మొబైల్ నంబర్ల మధ్య తక్షణమే నగదు బదిలీ కోసమని 2016లో యూపీఐని కేంద్రం తీసుకొచ్చింది. ‘‘2016 అక్టోబర్‌లో రూ.50 కోట్ల విలువైన లవాదేవీలు యూపీఐ ద్వారా జరిగితే, ఈ సెప్టెంబర్‌లో అవి రూ.59,800 కోట్లకు పెరిగాయి. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్‌ను 1.25 కోట్ల మంది వినియోగిస్తున్నారు. భీమ్ యాప్ ద్వారా జరిగే లావాదేవీల విలువ ఈ రెండేళ్ల కాలంలో రూ.2 కోట్ల నుంచి రూ.7,060 కోట్లకు పెరిగింది. రూపే కార్డుల ద్వారా పీవోఎస్ మెషీన్ల వద్ద జరిపే లావాదేవీల విలువ డీమోనిటైజేషన్‌కు ముందు రూ.800 కోట్లు కాగా 2018 సెప్టెంబర్ నాటికి రూ.5,730 కోట్లకు పెరిగింది. ఈ కామర్స్ పోర్టళ్లలో లావాదేవీల విలువ రూ. 300 కోట్ల నుంచి రూ.2,700 కోట్లకు చేరింది’’ అని జైట్లీ గణాంకాలను ముందరపెట్టారు. -
డిజిటల్ బాట పట్టించిన బడ్జెట్
-
డిజి.. డిజి.. అడుగులు
2017-18 బడ్జెట్ స్వరూపం (రూ. కోట్లలో) పథకాల వ్యయం - 9,45,078 పథకాలు కాక ఇతర వ్యయం -12,01,657 మొత్తం వ్యయం - 21,46,735 దేశాన్ని డిజిటల్ బాట పట్టించిన జైట్లీ బడ్జెట్ - పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ‘డిజిటల్’ పెంపుపై దృష్టి - పేదల కోసం త్వరలో ఆధార్ అనుసంధానిత ‘ఆధార్ పే’ - భీమ్ యాప్ వినియోగానికి ప్రోత్సాహకాల ప్రకటన - ‘పీఓఎస్’పై సుంకాల రద్దు.. మార్చికల్లా 10 లక్షల పీఓఎస్‌లు - పోస్టాఫీసులు, పెట్రోల్ పంపులు, ఆస్పత్రులు, కాలేజీలు, - మునిసిపాలిటీల్లో డిజిటల్ చెల్లింపు సదుపాయాల కల్పన - 2017–18 లో 2.50 లక్షల డిజిటల్ లావాదేవీల లక్ష్యం - ‘భారత్ నెట్’కు రూ. 10 వేల కోట్లు నిధుల కేటాయింపు - గ్రామీణుల కోసం కొత్తగా ‘డిజి గావ్’ ప్రారంభం ఇది డిజిటల్ యుగం. ఆ బాటలో దేశదేశాలు వేగంగా పయనిస్తున్నాయి. ఇంకా మందగమనంలోనే ఉన్న భారతావనిని డిజిటల్ మార్గం పట్టించే ప్రయత్నం చేశారు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ. ఆ మార్గంలో వడివడిగా అడుగులు వేసేలా బడ్జెట్లో అనేక చర్యలు ప్రకటించారు. మూడు నెలల కిందట దేశాన్ని కుదిపేసిన పెద్ద నోట్ల రద్దు చర్య నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ, డిజిటల్ లావాదేవీలను పెంపొందించడం, గ్రామాల్లోనూ దీనిని ప్రోత్సహించడంపై దృష్టిపెట్టారు. డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం నుంచి డిజిటలీకరణ మౌలిక సదుపాయాలను విస్తరించడం వరకూ అనేక నిర్ణయాలు వివరించారు. ‘భారత్ ఇప్పుడు ఒక భారీ డిజిటల్ విప్లవ కూడలిలో ఉంది. డిజిటల్ వేదిక వైపు మారడం వల్ల సామాన్యుడికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం.. వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది’ అని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. టెక్ ఇండియాకు డిజిటల్ రూపాంతరీకరణ ఒక కీలకమైన పునాదిగా అభివర్ణిస్తూ.. అదే తమ అజెండాగా ప్రకటించారు. 2016 బడ్జెట్లో జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్, డిజిటల్ సాక్షరతా అభియాన్లను ప్రారంభించిన జైట్లీ.. తాజా బడ్జెట్లో దేశంలో డిజిటల్ విప్లవానికి పునాదులు వేశారు. ‘వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ కోసం మేం నిర్దేశించుకున్న పది కీలక అంశాల్లో ‘డిజిటల్’ఒకటి. డిజిటల్ ఎకానమీని పెంపొందించడం ప్రభుత్వ వ్యూహంలో అంతర్భాగం. ఇది.. ఆర్థికవ్యవస్థను మరింత ఎక్కువగా క్రమబద్ధీకరించడం, ద్రవ్య వ్యవస్థను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే విషయంలో పరిణామాత్మక ప్రభావం చూపుతుంది. దీని ఫలితంగా రుణం ధర తగ్గి దేశంలో ప్రైవేటు పెట్టుబడులను ఉత్తేజపరుస్తుంది. డిజిటల్ లావాదేవీలు పెరగడం వల్ల.. చిన్న, సూక్ష్మ సంస్థలకు వ్యవస్థీకృత రుణం అందేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. రుణాలు తీసుకునే వారికి వారి లావాదేవీల చరిత్ర ఆధారంగా హామీ రహిత అప్పులు అందించే రుణ సంస్థలకు రీఫైనాన్స్ చేసేలా సిడ్బీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది’అని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. డాటా అనలిటిక్స్ (సమాచార విశ్లేషణల) ద్వారా పన్ను కట్టేలా చూడటం, జవాబుదారీతనం పెంచడం, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడం, గ్రామీణ మార్కెట్లను బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని మెరుగుపరచడం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను ఆధునీకరించడం, డిజిటల్ పత్రాలను దాచడం వంటి విభిన్న రంగాల్లో సాంకేతికతను ఎలా వినియోగించుకుంటామనేది ఆయన వివరించారు. జైట్లీ బడ్జెట్లో డిజిటల్ విప్లవం దిశగా ప్రకటించిన ముఖ్యమైన చర్యలివీ.. ‘నగదు’పై రూ. 3 లక్షల పరిమితి నల్లధనంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిఫారసుల మేరకు, రూ. 3 లక్షలకు మించిన లావాదేవీలను నగదు రూపంలో జరపడానికి ఇక అనుమతించరాదని నిర్ణయించినట్లు జైట్లీ ప్రకటించారు. అంటే.. రూ. 3 లక్షలకు మించిన లావాదేవీలను డిజిటల్ రూపంలోనే చేయాలి. లక్ష్యం రూ. 2,500 కోట్లు ఇప్పటికే డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయనేందుకు ఆధారాలున్నాయన్న ఆర్థికమంత్రి.. 2017– 18 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ, యూఎస్ఎస్డీ, ఆధార్ పే, ఐఎంపీఎస్, డెబిట్ కార్డుల ద్వారా 2,500 కోట్ల డిజిటల్ లావాదేవీల లక్ష్యాన్ని సాధించడానికి ఒక కార్యక్రమాన్ని నెలకొల్పుతామని తెలిపారు. పీఓఎస్‌లపై సుంకాలు రద్దు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి.. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లు, వేలిముద్ర రీడర్లు తదితర పరికరాలపై అన్ని సుంకాల (సీవీడీ, ఎస్ఏడీ) నుంచీ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జైట్లీ చెప్పారు. 10 లక్షల పీఓఎస్‌లు ఈ ఏడాది మార్చి కల్లా 10 లక్షల పీఓఎస్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాల్సిందిగా బ్యాంకులకు నిర్దేశించినట్లు జైట్లీ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 20 లక్షల ఆధార్ అనుసంధానిత పీఓఎస్‌లను ఏర్పాటు చేసేలా బ్యాంకులను ప్రోత్సహిస్తామన్నారు. పార్టీ విరాళాలు సైతం రాజకీయ పార్టీలను జైట్లీ వదిలిపెట్టలేదు. వ్యక్తులు, సంస్థల నుంచి గరిష్టంగా రూ. 20,000 వరకూ విరాళాలను నగదు రూపంలో స్వీకరించేందుకు గల పరిమితిని రూ. 2000 కు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంతకు మించిన మొత్తంలో విరాళాలను చెక్కులు, లేదా డిజిటల్ రూపంలోనే స్వీకరించే విధంగా నిబంధనలు సవరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బిల్లులూ డిజిటల్ నిర్దిష్ట మొత్తానికి మించిన ప్రభుత్వ వసూళ్లన్నిటినీ డిజిటల్ మార్గంలోనే స్వీకరించడం తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనను అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే.. రైలు ప్రయాణాల కోసం ఐఆర్సీటీసీ ద్వారా ఈ–టికెట్లు బుక్ చేస్తే వసూలు చేస్తున్న సర్వీస్ చార్జీలను రద్దుస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. చెల్లింపుల నియంత్రణ బోర్డు భారతీయ రిజర్వు బ్యాంకు పరిధిలో.. ప్రస్తుతమున్న ‘చెల్లింపులు, పరిష్కారాల వ్యవస్థ నియంత్రణలు, పర్యవేక్షణ బోర్డు’ను రద్దు చేసి, దాని స్థానంలో ‘చెల్లింపుల నియంత్రణ బోర్డు’ను నెలకొల్పాలని ప్రతిపాదించినట్లు జైట్లీ తెలిపారు. చెల్లింపుల వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణల కోసం చేసిన సిఫారసులు ప్రాతిపదికగా.. ఆర్థిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని కమిటీ ‘చెల్లింపులు, పరిష్కారాల వ్యవస్థ చట్టం 2007’ను సమగ్రంగా సమీక్షించి, తగిన సవరణను తీసుకువస్తుందని చెప్పారు. సిఫారసుల సత్వర అమలు డిజిటల్ లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీ మధ్యంతర సిఫారసులను పరిగణనలోకి తీసుకుని, వాటిని సత్వరం అమలు చేయడానికి ప్రభుత్వం వివిధ భాగస్వాములతో కలిసి పని చేస్తుందని తెలిపారు. డిజిటలీకరణ చర్యలను అమలు చేసేందుకు అవసరమైన నిధులను పెంపొందించడం కోసం ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఫండ్ (అందరికీ ఆర్థిక భాగస్వామ్య నిధి)ను బలోపేతం చేస్తామని చెప్పారు. అదేవిధంగా.. యూపీఐ (యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సహా వివిధ రకాల డిజిటల్ లావాదేవీల ద్వారా రూ. 2,500 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ‘స్వయం’తో డిజిటల్ పాఠాలు డిజిటల్ అగాధానికి ఆన్లైన్ విద్య ద్వారా వారథి నిర్మించడానికి.. ప్రభుత్వ ‘స్వయం’వేదిక ద్వారా 350 ఆన్లైన్ కోర్సులను ప్రారంభిస్తామని చెప్పారు. ‘స్వయం’ ద్వారా.. పాఠశాల, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్, న్యాయవిద్య తదితర ప్రొఫెషనల్ కోర్సులు కలిపి మొత్తంగా 2,000 కోర్సులు, 80,000 గంటల అధ్యయన సామర్థ్యం సంతరించుకుంటుందని వివరించారు. ‘భారత్ నెట్’కు రూ. 10 వేల కోట్లు ప్రపంచంలో అతిపెద్ద గ్రామీణ బ్రాడ్ బా్యండ్ అనుసంధాన ప్రాజెక్టు అయిన ‘భారత్ నెట్’కోసం బడ్జెట్ కేటాయింపులను రూ. 10,000 కోట్లకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే 1.55 లక్షల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుళ్లను పరిచినట్లు తెలిపారు. 1.50 లక్షల గ్రామ పంచాయతీలలో.. తక్కువ ధరలకు హాట్సా్పట్లు, డిజిటల్ సర్వీలతో కూడిన హైస్పీడ్ ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. పేదల కోసం ‘ఆధార్ పే’ డెబిట్ కార్డులు, మొబైల్ ఫోన్లు, మొబైల్ వ్యాలెట్లు లేని వారి కోసం ఆధార్ అనుసంధానిత వాణిజ్య చెల్లింపుల వ్యవస్థ ‘ఆధార్ పే’ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ బయోమెట్రిక్ ఆధార్ చెల్లింపుల వ్యవస్థ ద్వారా ప్రజలు తమ ఆధార్ నంబరు లేదా వేలిముద్రల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటికే 14 బ్యాంకులు ‘ఆధార్ పే’లో చేరినట్లు తెలిపారు. గ్రామీణుల కోసం ‘డిజి గావ్’ డిజిటల్ సాంకేతికత ద్వారా టెలిమెడిసిన్, విద్య, నైపుణ్యాలను అందించేందుకు ‘డిజి గావ్’కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ చర్యలు.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ ఇండియాలను మలుపుతిప్పుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఊరూరా డిజిటల్ సౌకర్యాలు ‘పోస్టాఫీసులు, చౌకధరల దుకాణాలు, బ్యాంకింగ్ ప్రతినిధుల ద్వారా గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. పెట్రోల్ పంపులు, ఎరువుల దుకాణాలు, మునిసిపాలిటీలు, మండల కార్యాలయాలు, రోడ్డు రవాణా కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఆస్పత్రుల్లో భీమ్ యాప్ సహా డిజిటల్ చెల్లింపుల కోసం సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం’అని జైట్లీ ప్రకటించారు. ‘భీమ్’ ప్రోత్సాహక పథకాలు ‘డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మేళనంలో మొబైల్ ఫోన్ల శక్తిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భీమ్ (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) అప్లికేషన్ వెలికితీస్తుంది. ఇప్పటికే 125 లక్షల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీని వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తుంది’అని జైట్లీ ప్రకటించారు. వీటిలో వ్యక్తులకు బోనస్ పథకాలు, వ్యాపారులకు నగదు రహిత పథకాలు ఉంటాయన్నారు. భవిష్యత్‌లో లాభదాయకం: మోదీ ఇది భవిష్యత్‌లో లాభా లు కలిగించే బడ్జెట్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిం చారు. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. పేదలు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా, వారి కలలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థికమంత్రి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. ఉద్యోగ, ఉపాధి కల్పన, పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి బాటలో గత రెండేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనికి, రాబోయే కాలంలో చేపట్టబోయే చర్యలకు మధ్య వారధిగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఆయన చెప్పారు. దేశ అభివృద్ధిలో వేగం పెంచడానికి, రైతుల ఆదాయం రెట్టింపు కావడానికి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనకు బడ్జెట్ ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. మధ్య తరగతి వర్గాల ఆదాయం పెరుగుతుందని, ముఖ్యంగా గ్రామీణుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. దళితు లు, రైతుల సమస్యలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టిసా రించామన్నారు. రైల్వేల ఆధునీకరణ మొదలుకుని, ఆర్థిక సంస్కరణల వరకు, అలాగే విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక రంగం వరకు అన్ని వర్గాలకు మేలు చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం, మహిళా సంక్షేమానికి రికార్డు స్థాయిలో కేటాయింపులున్నాయన్నారు. అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్‌ను ప్రవేశపెట్టడంవల్ల పన్నుల ఎగవేత తగ్గుతుందని చెప్పారు. తక్కువ ఆదాయం ఉన్న సామాన్యవర్గాలకు ఊరట కలిగించే చర్యలున్నాయన్నారు. రైల్వే బడ్జెట్‌ను సామాన్య బడ్జెట్లో కలపడంవల్ల రవాణారంగం అభివృద్ధికి ఊతం కలుగుతుందన్నారు. బడ్జెట్ హైలైట్స్ - రూ.3 లక్షలకు పైబడిన అన్ని నగదు లావాదేవీలపై నిషేధం - రూ.50 కోట్లలోపు టర్నోవర్ ఉన్న సంస్థలపై కార్పొరేట్ పన్ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గింపు - వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి లక్ష్యం 4.1 శాతం, రుణాల మంజూరు లక్ష్యం రూ.10 లక్షల కోట్లు. ఐదేళ్లలో రైతుల ఆదాయం రెండింతలయ్యేలా చర్యలు - 2018 మే నాటికి దేశంలోని 100 శాతం గ్రామాలకు విద్యుత్ - ఉపాధి హామీ పథకానికి ఇప్పటివరకు అత్యధికంగా రూ.48,000 కోట్లు కేటాయింపు - రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం. కేవలం చెక్కులు, ఇతర డిజిటల్ రూపాల్లోనే స్వీకరించాలి - ఐఆర్సీటీసీ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై సర్వీసు చార్జీల ఎత్తివేత - చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి ‘నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్’కు సవరణలు - దేశం విడిచి పారిపోయిన ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణలు -
'బోగస్ రేషన్ కార్టులను ఏరివేస్తాం'
పానాజీ: వేలాది బోగస్ రేషన్ కార్డులను ఎత్తివేయడానికి గోవా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిజిటలైజేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత బోగస్ కార్టులను ఏరివేస్తామని గోవా పౌర సరఫరాల శాఖా మంత్రి దయానంద్ మండ్రేకర్ శాసనసభకు తెలిపారు. ఇప్పటికే రేషన్ కార్డుల డిజిటలైజేషన్ కార్యక్రమం కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వేలాది బోగస్ కార్డులు ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఉందని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోవా రాష్ట్రంలోని బర్డేజ్ తాలుకాలో 70 రేషన్ కార్డులకు గాను.. 44 వేల కార్టులను డిజిటలైజేషన్ పూర్తయిందని మంత్రి మండ్రేకర్ తెలిపారు.