వాటికా గ్రూపు ఎండీ, డైరెక్టర్లపై చీటింగ్ కేసు | Vatika MD, directors booked for fraud | Sakshi
Sakshi News home page

వాటికా గ్రూపు ఎండీ, డైరెక్టర్లపై చీటింగ్ కేసు

May 6 2016 7:04 PM | Updated on Sep 3 2017 11:32 PM

వాటికా గ్రూపు ఎండీ, డైరెక్టర్లపై చీటింగ్ కేసు

వాటికా గ్రూపు ఎండీ, డైరెక్టర్లపై చీటింగ్ కేసు

వాటికా గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీతో పాటు ఇద్దరు డైరెక్టర్లపై చీటింగ్ కేసు నమోదైంది.

వాటికా గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీతో పాటు ఇద్దరు డైరెక్టర్లపై చీటింగ్ కేసు నమోదైంది. కోటి రూపాయల మేరకు మోసం చేసినందుకు ఈ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎండీ గౌతమ్ భల్లా, గ్రూపు డైరెక్టర్లు అనిల్ భల్లా, గౌరవ్ భల్లాలపై ఐపీసీ సెక్షన్లు 406, 420ల కింద కేసు నమోదైంది. ఢిల్లీ మాలవీయ నగర్‌కు చెందిన రాజ్‌కమల్ భాటియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

అనిల్ భల్లా, ఆయన కుమారులు కోటి రూపాయల మేరకు మోసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009 డిసెంబర్ నెలలో ఓ విల్లా కొనుగోలు కోసం భాటియా ఈ మొత్తం చెల్లించారని, కానీ ఆ కంపెనీ మాత్రం విల్లా ఇవ్వలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. విల్లా ఇవ్వకపోగా.. తన సొమ్ము కూడా వెనక్కి తిరిగి ఇవ్వలేదని భాటియా వాపోయారు. పోలీసు శాఖలోని ఆర్థిక అక్రమాల విభాగం దీనిపై విచారణ జరుపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement