సోనియాకు కేజ్రీవాల్ లేఖ | Take action against Bhagana rape accused: Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

సోనియాకు కేజ్రీవాల్ లేఖ

Jul 4 2014 8:50 PM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియాకు కేజ్రీవాల్ లేఖ - Sakshi

సోనియాకు కేజ్రీవాల్ లేఖ

భాగనా సామూహిక అత్యాచార నిందితులపై చర్య తీసుకోవాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: భాగనా సామూహిక అత్యాచార నిందితులపై చర్య తీసుకోవాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. నిందితులపై తగిన చర్యలు చేపట్టేలా హర్యానా ప్రభుత్వాన్ని కోరాలని సోనియాకు ఆయన విజ్ఞప్తి చేశారు.

భాగనా ప్రాంతంలో మార్చి 23న నలుగురు దళిత మహిళలను అపహరించి దుండగులు రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇప్పటివరకు నిందితులపై హర్యానా ప్రభుత్వం చర్య తీసుకోలేదని కేజ్రీవాల్ ఆరోపించారు. బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి ఏప్రిల్ 16 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న స్పందన కరువయిందని విమర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement