మొసలితో పోరాడి గెలిచిన చిన్నారి | Six-year-old girl hits crocodile with a bamboo stick to save friend | Sakshi
Sakshi News home page

మొసలితో పోరాడి గెలిచిన చిన్నారి

Apr 6 2017 4:38 AM | Updated on Sep 5 2017 8:01 AM

మొసలితో పోరాడి గెలిచిన చిన్నారి

మొసలితో పోరాడి గెలిచిన చిన్నారి

ఆరేళ్ల చిన్నారి తన స్నేహితురాలి ప్రాణాలు కాపా డటం కోసం మొసలితో పోరాడిన ఘటన ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో చోటుచేసుకుంది.

కేంద్రపర: ఆరేళ్ల చిన్నారి తన స్నేహితురాలి ప్రాణాలు కాపా డటం కోసం మొసలితో పోరాడిన ఘటన ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో చోటుచేసుకుంది. బాంకు లాలా గ్రామానికి చెందిన టికీ దలాయ్‌ తన స్నేహితురాలు బసంతి దలాయ్‌తో కలసి చెరువులో స్నానం చేయడానికి వెళ్లింది. ఇంతలో మొసలి బసంతిపై దాడిచేసింది. చాకచక్యంగా వ్యవహరించిన టికీ తన సమీపంలోని కర్రతో మొసలి తలపై మోది స్నేహితురాలిని కాపాడింది. ప్రమాదంలో బసంతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించారు. తన ధైర్య సాహసాలతో స్నేహితురాలి ప్రాణాలు కాపాడినందుకు టికీని స్థానికులు అభినందించారు. కాగా, బసంతి వైద్యానికి అయ్యే ఖర్చులు తామే భరిస్తామని, నష్ట పరిహారాన్ని కూడా అందిస్తామని అటవీ అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement