యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ | Man arrested for molesting girl | Sakshi
Sakshi News home page

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

Nov 5 2013 8:42 AM | Updated on Oct 9 2018 5:39 PM

నగరంలో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి రుద్రనారాయణ శర్మను ఈ రోజు తెల్లవారుజామున జాదవ్పూర్లోని గాంధీ కాలనీలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు.

నగరంలో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి రుద్రనారాయణ శర్మను ఈ రోజు తెల్లవారుజామున జాదవ్పూర్లోని గాంధీ కాలనీలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. జాదవ్పూర్ ప్రాంతంలో గత రాత్రి రోడ్డు పక్కన తన స్నేహితుడితో నిల్చోని ఉన్న యువతి పట్ల శర్మ అసభ్యంగా ప్రవర్తించాడు.

 

దాంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కేసు నమోదు చేసి, నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితునికి సంబంధించిన గుర్తులను యువతి పోలీసులకు వివరించింది. దాంతో పోలీసులు నిందితుడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement