లీ ఎకో స్మార్ట్‌టీవీ వచ్చేసింది..! | LeEco Super3 TV series launched in India | Sakshi
Sakshi News home page

లీ ఎకో స్మార్ట్‌టీవీ వచ్చేసింది..!

Aug 4 2016 8:34 PM | Updated on Sep 4 2017 7:50 AM

లీ ఎకో స్మార్ట్‌టీవీ వచ్చేసింది..!

లీ ఎకో స్మార్ట్‌టీవీ వచ్చేసింది..!

చైనా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ 'లీ ఎకో' తాజాగా తన సూపర్3’ సిరీస్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది.

చైనా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ 'లీ ఎకో'  తాజాగా తన సూపర్3’ సిరీస్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల ఎక్స్55 X 65 అంగుళాల ఎక్స్65 X 65 అంగుళాల మ్యాక్స్65’అనే ప్రొడక్టులు ఉన్నాయి. 4కే అల్ట్రా హెచ్‌డీ (3840 X 2160) రెజల్యూషన్ వీటి సొంతం.

 

ఎక్స్55’ ధర రూ.59,790గా, ఎక్స్65’ ధర రూ.99,790గా, మ్యాక్స్65’ ధర రూ.1,49,790గా ఉంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయని, ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్‌ను రన్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎక్స్55’లో 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీని, మిగతా ప్రొడక్టులలో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ ఫీచర్లను పొందుపరిచామని పేర్కొంది. ఈ ఆండ్రాయిడ్ టీవీలన్నీ వినియోగదారులకు కంపెనీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లీమాల్ సహా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 10 నుంచి అందుబాటులో ఉంటాయని వివరించింది.



 

Advertisement
 
Advertisement
Advertisement