కుంటాల జలపాతంలో ఇద్దరు గల్లంతు | Two died in the Kuntala waterfall | Sakshi
Sakshi News home page

కుంటాల జలపాతంలో ఇద్దరు గల్లంతు

Jul 2 2017 4:24 PM | Updated on Aug 17 2018 2:56 PM

విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది.

ఆదిలాబాద్‌: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ వద్ద గల ప్రఖా‍్యత విహార ప్రదేశమైన కుంటాల జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఫొటోలు దిగేందుకు నీటిలోకి దిగిన అన్సార్‌, ఫైజాన్‌ అనే 21 ఏళ్ల వయసున్న యువకులు కాలుజారి పడిపోయి గల్లంతయ్యారు.

వీరు నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల్‌ గ్రామానికి చెందిన వారు. వీరు తమ గ్రామానికే చెందిన మరో ముగ్గురు మిత్రులతో కలిసి విహార యాత్రకు వచ్చారు. అన్సార్‌ బైక్‌ మెకానిక్‌ కాగా ఫైజాన్‌ విద్యుత్‌ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మిగతా ముగ్గురు బీటెక్‌ చదువుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement