వెస్టిండీస్ పేసర్ జెరోమ్ టేలర్ తన 13 ఏళ్ల టెస్టు కెరీర్ కు ముగింపు పలికాడు.
కింగ్‌స్టన్: వెస్టిండీస్ పేసర్ జెరోమ్ టేలర్ తన 13 ఏళ్ల టెస్టు కెరీర్ కు ముగింపు పలికాడు. అయితే వన్డేలకు మాత్రం అందుబాటులో ఉంటానని చెప్పాడు. 32 ఏళ్ల టేలర్ 46 టెస్టుల్లో 130 వికెట్లు తీశాడు. 2003లో అరంగేట్రం చేసిన టేలర్ గత జనవరిలో ఆసీస్‌తో చివరి టెస్టు ఆడాడు. వరుస గాయాల కారణంగా 2009 నుంచి 2014 వరకు జట్టుకు దూరమయ్యాడు. 2008లో కివీస్‌తో జరిగిన టెస్టులో ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మన్‌గా దిగి 106 పరుగులతో సెంచరీ సాధించాడు.