ఆనంద్‌కు తొలి ఓటమి | Viswanathan Anand Loses to Sergey Karjakin in Candidates Chess | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొలి ఓటమి

Mar 16 2016 4:31 AM | Updated on Sep 3 2017 7:49 PM

క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి ఓటమి ఎదురైంది.

మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి ఓటమి ఎదురైంది. సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 43 ఎత్తుల్లో ఓడిపోయాడు. తాజా ఓటమితో ఆనంద్ రెండు పాయింట్లతో మరో ఇద్దరితో కలసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement