నువ్వు నా సూపర్‌స్టార్‌వి: గంగూలీ

Sourav Ganguly Heartwarming Reply To Yuvraj Singh Congratulatory Wish - Sakshi

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా నియామకం ఖరారైన నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ సారథి సౌరవ్‌ గంగూలీకి సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దాదాకు సన్నిహితుడిగా పేరొందిన డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తనదైన శైలిలో తన ‘కెప్టెన్‌’కు విషెస్‌ చెప్పాడు. ‘ టీమిండియా కెప్టెన్‌ నుంచి బీసీసీఐ అధ్యక్షుడి దాకా గొప్ప వ్యక్తి.. గొప్ప ప్రయాణం. క్రికెటర్‌ పాలనలోకి దిగితే.. అదే విధంగా ఆటగాళ్ల కోణం నుంచి పాలన సాగించడం ఎలా ఉంటుందో ఆలోచించండి. గుడ్‌లక్‌ దాదా’ అంటూ యువీ గంగూలీపై అభిమానం చాటుకున్నాడు. ఇక యువీ ట్వీట్‌పై గంగూలీ సైతం అదే రీతిలో బదులిచ్చాడు. ‘థ్యాంక్యూ బెస్ట్‌. ఇండియా కోసం ప్రపంచ కప్‌లు గెలిచావు. ఇక ఆట కోసం కొన్ని మంచి పనులు చేయాల్సి ఉంటుంది. నువ్వు నా సూపర్‌స్టార్‌వి. ఆ దేవుడి దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు.

ఈ క్రమంలో దాదా బీసీసీఐ అధ్యక్షుడైన నేపథ్యంలో భారత క్రికెట్‌లో యువీ కీలక సేవలు అందించే అవకాశం ఉందని అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా యువరాజ్‌సింగ్‌ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తనకు విషెస్‌ చెప్పిన ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్వీట్‌కు సైతం దాదా ఈ తరహాలోనే స్పందించాడు. ‘ థాంక్యూ భజ్జీ.  నువ్వు ఎలాగైతే భారత్‌కు విజయాలు అందించావో అదే తరహా నీ సహకారం మాకు కావాలి. భజ్జీ.. నీ అవసరం ఉంది’  అంటూ గంగూలీ ట్వీట్‌ చేయడంతో హర్భజన్‌ మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top