వైరల్‌ : కుల్దీప్‌పై సెహ్వాగ్‌ ఫన్నీ ట్వీట్‌ | Sehwag Funny Tweet About Kuldeep Performance | Sakshi
Sakshi News home page

Jul 13 2018 2:26 PM | Updated on Jul 13 2018 2:29 PM

Sehwag Funny Tweet About Kuldeep Performance - Sakshi

బహుబలిని ఎలా చంపిండో తెలిసిపోయింది కానీ.. కుల్దీప్‌ ఆట మాత్రం.. 

న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో ‍ప్రశంసలు కురిపించాడు. గురువారం జరిగిన తొలి వన్డేలో కుల్దీప్‌ ఏకంగా 6 వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. అయితే ప్రతీ విషయంపై ఫన్నీగా ట్వీట్‌ చేసే సెహ్వాగ్‌ కుల్దీప్‌ను సైతం అదే తరహాలో కొనియాడాడు. ‘అరే ఏం బౌలింగ్‌.. కుల్దీప్‌ టాప్‌ 5 గొప్ప ప్రదర్శనలన్నీ ఓవర్సీస్‌లోనివే. కట్టప్పా.. బహుబలిని ఎలా చంపిండో తెలిసిపోయింది కానీ.. కుల్దీప్‌ ఆట మాత్రం ఇం‍గ్లండ్‌కు అర్థం కావడం లేదు’ అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

6 వికెట్లు పడగొట్టిన కుల్దీప్‌ ఈ ఘనత సాధించిన తొలి లెఫ్టార్మ్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కుల్దీప్‌ ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆడుకోగా.. రోహిత్‌ శతకంతో బౌలర్లను ఆడుకోని భారత్‌కు విజయాన్నందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement