ధోని సేన ఫీల్డింగ్.. కోహ్లి గ్యాంగ్ బ్యాటింగ్ | pune super giants won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ధోని సేన ఫీల్డింగ్.. కోహ్లి గ్యాంగ్ బ్యాటింగ్

Apr 22 2016 7:50 PM | Updated on Sep 3 2017 10:31 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇక్కడ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇక్కడ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో  జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ధోని తొలుత కోహ్లి గ్యాంగ్ ను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఇరు జట్లు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక దాంట్లో మాత్రమే గెలిచాయి.

 

పుణె, రాయల్ చాలెంజర్స్ లు తమ తమ తొలి మ్యాచ్ల్లో విజయం సాధించి జోరు మీద కనిపించినా, ఆ తరువాత వెనుకబడ్డాయి.  దీంతో ఈ మ్యాచ్ లో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. పుణె జట్టులో కెవిన్ పీటర్సన్, స్టీవ్ స్మిత్, డు ప్లెసిస్, ధోని, మిచెల్ మార్ష్ లు  బ్యాటింగ్ లో ప్రధాన బలం కాగా, రాయల్ చాలెంజర్స్ జట్టులో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్,  సర్ఫరాజ్ ఖాన్, కేదర్ జాదవ్లు కీలక ఆటగాళ్లు.

Advertisement
 
Advertisement
Advertisement