ఫీల్డింగ్ ఎంచుకున్న పుణె | pune super giants won the toss and elected field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న పుణె

May 5 2016 7:48 PM | Updated on Sep 3 2017 11:28 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా గురువారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఢిల్లీ ఏడు మ్యాచ్లు ఆడి ఐదింట గెలవగా, పుణె ఎనిమిది మ్యాచ్ల్లో రెండు మాత్రమే నెగ్గింది. ఈ మ్యాచ్లో గెలిచి టాప్ ప్లేస్లోకి చేరాలని ఢిల్లీ అండ్ గ్యాంగ్ భావిస్తుండగా, వరుస మ్యాచ్ ల్లో ఓటమితో  ఢీలా పడిన పుణె కనీసం ఈ మ్యాచ్ లోనైనా గెలుపుతో గాడిలో  పడాలని యోచిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement