పుణెకు మరో ఎదురుదెబ్బ | Mitchell Marsh ruled out of IPL 2016 with side strain | Sakshi
Sakshi News home page

పుణెకు మరో ఎదురుదెబ్బ

May 1 2016 4:29 PM | Updated on Sep 3 2017 11:12 PM

పుణెకు మరో ఎదురుదెబ్బ

పుణెకు మరో ఎదురుదెబ్బ

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పుణె సూపర్ జెయింట్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో  పేలవ ప్రదర్శనతో  వెనుకబడిన పుణె సూపర్ జెయింట్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పుణె ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్  గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మిచెల్ మార్ష్ తొడ కండరాలు  పట్టేయడంతో ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే ఇద్దరు పుణె ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, డు ప్లెసిస్ లు గాయాల బారిన పడి టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.

 

పీటర్సన్ కాలిపిక్క గాయంతో టోర్నీనుంచి తప్పుకోగా,  డు ప్లెసిస్ చేతి వేలు విరగడంతో జట్టు నుంచి వైదొలిగాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్లు ఆడిన ధోని అండ్ గ్యాంగ్ రెండింట మాత్రమే విజయం సాధించి చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement