సొంతగడ్డపై కరీబియన్లకు షాక్ | Australia beats west indies in Tri-Nation One-Day International Series final | Sakshi
Sakshi News home page

సొంతగడ్డపై కరీబియన్లకు షాక్

Jun 27 2016 10:33 AM | Updated on Sep 4 2017 3:33 AM

సొంతగడ్డపై కరీబియన్లకు షాక్

సొంతగడ్డపై కరీబియన్లకు షాక్

ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

బార్బడోస్: ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఫైనల్లో మిచెల్ మార్ష్ ఆల్ రౌండ్ షోతో పాటు హజ్లెవుడ్ సూపర్ స్పెల్తో విజృంభించడంతో ఆస్ట్రేలియా 58 పరుగులతో వెస్టిండీస్పై ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన ఈ డే/నైట్ మ్యాచ్లో కరీబియన‍్లకు నిరాశ  ఎదురైంది. మార్ష్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, హజ్లెవుడ్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.

271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 45.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. చార్లెస్ 45, రాందిన్ 40, హోల్డర్ 34 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు హజ్లెవుడ్ 5, మార్ష్ 3 వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 270 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (57 నాటౌట్) హాఫ్ సెంచరీతో పాటు ఫించ్ 47, స్మిత్ 46, మార్ష్ 32 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లు హోల్డర్, గాబ్రియెల్ చెరో రెండు వికెట్లు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement