ఆనంద్‌కు మూడో గెలుపు | Anand's victory in third win | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మూడో గెలుపు

Mar 22 2016 12:45 AM | Updated on Sep 3 2017 8:16 PM

క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో విజయాన్ని సాధించాడు.

మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో విజయాన్ని సాధించాడు. లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా)తో సోమవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడుతూ 66 ఎత్తుల్లో గెలిచాడు. తొమ్మిదో రౌండ్ తర్వాత ఆనంద్ 5.5 పాయింట్లతో సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement