ఆనంద్‌కు ఐదో ‘డ్రా’ | Anand's in fifth 'draw' | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు ఐదో ‘డ్రా’

Mar 21 2016 12:49 AM | Updated on Sep 3 2017 8:12 PM

క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. .....

మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచమాజీ చాంపియన్ వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత ఆనంద్ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఐదు పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా) అగ్రస్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement