‘చంద్రబాబు రియల్‌ టైం’పై పవన్‌ కల్యాణ్‌ సెటైర్లు | Pawan Kalyan Reaction Over Polavaram Road Damage | Sakshi
Sakshi News home page

Nov 4 2018 10:03 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Reaction Over Polavaram Road Damage - Sakshi

సాక్షి, పోలవరం/పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లే రోడ్డు శనివారం ఒక్కసారిగా పైకి చొచ్చుకొచ్చి బీటలువారిన సంగతి తెలిసిందే. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఏజెన్సీ ప్రాంతానికి రాకపోకలు బంద్‌ అయ్యాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్న విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. (పోలవరం ప్రాజెక్టు వద్ద కలకలం)

ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న చంద్రబాబు రియల్‌ టైం గవర్నెన్స్‌ పోలవరం రోడ్డు ఘటనపై వివరణ ఇవ్వాలి. రోడ్డు కిలోమీటర్‌ మేర ఇంత దారుణంగా దెబ్బతినడాన్ని రియల్‌ టైం గవర్నెన్స్‌ టీమ్‌ గ్రహించిందా?  కారణాలేంటో చెప్తారా? కొంపతీసి పోలవరం ప్రాంతంలో భూకంపం వచ్చిందంటారా? ప్రజలను అయోమయంలో పడేయకుండా.. కొంచెం క్లారిటీ ఇవ్వండని పవన్‌ ట్విటర్లో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement