మినరల్‌ వాటర్‌ అడిగామన్నది అబద్ధం.. | Mopidevi Venkataramana condemns rumours | Sakshi
Sakshi News home page

మినరల్‌ వాటర్‌ అడిగామన్నది అబద్ధం..

Aug 18 2019 6:22 PM | Updated on Aug 18 2019 7:06 PM

Mopidevi Venkataramana condemns rumours - Sakshi

సాక్షి, అమరావతి: తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మత్స్య, పశుసంవర్థక, మార్కెటింగ్‌ శాఖామంత్రి మోపిదేవి వెంకటరమణ తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా పెసరలంక గ్రామంలో వరద బాధితులకు అవసరం అయిన సహాయక చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. అయితే టీడీపీ నేతలు, కొన్ని చానల్స్‌ ... ముంపు బాధితులను తాము మినరల్‌ వాటర్‌ అడిగామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఇప్పటికైనా అబద్ధాలు ఆపకుంటే న్యాయపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా కృష్ణానది పరివాహక ప్రాంతం వరద ప్రభావానికి ముంపుకు గురైన జువ్వలపాలెం,పెసరలంక గ్రామాలలో మంత్రి నిన్న పర్యటించి, సహాయక చర్యలను పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement