పెళ్లి కోసం మతం మారాలట! | To be converted for the wedding! | Sakshi
Sakshi News home page

పెళ్లి కోసం మతం మారాలట!

Dec 1 2016 3:06 AM | Updated on Sep 22 2018 7:37 PM

సివిల్ సర్వీసెస్-2015 టాపర్ టీనా దాబి.. రెండో ర్యాంకర్ షఫీ ఖాన్‌ను పెళ్లాడతానన్న ప్రకటనపై అఖిల భారతీయ హిందూ మహాసభ అభ్యంతరం తెలిపింది.

మీరట్: సివిల్ సర్వీసెస్-2015 టాపర్ టీనా దాబి.. రెండో ర్యాంకర్ షఫీ ఖాన్‌ను పెళ్లాడతానన్న ప్రకటనపై అఖిల భారతీయ హిందూ మహాసభ అభ్యంతరం తెలిపింది. ఆమె తల్లిదండ్రులకు రాసిన లేఖలో...ఈ పెళ్లి ప్రతిపాదనను విరమించుకోవాలని లేదా ఖాన్‌ను మత మార్పిడికి ఒప్పించాలంది.

‘ఖాన్‌ను టీనా పెళ్లి చేసుకోవాలనుకోవడం షాక్‌కు గురిచేసింది. ఇది లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉంది. ఇది జరగకూడదు. అరుునా వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖాన్ మతం మార్చుకోవాలి. దీని కోసం మా సభ్యులు మీకు సాయం చేస్తారు’ అని సంస్థ జాతీయ కార్యదర్శి మున్నా  శర్మ  టీనా తండ్రి జశ్వంత్‌కి లేఖ పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement