అటల్‌జీ తొలి వర్ధంతి : అగ్ర నేతల నివాళి

President Kovind PM Modi Amit Shah Pay Tribute To Vajpayee - Sakshi

సాక్షి,,న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులు దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు  శుక్రవారం .దేశ రాజధానిలోని వాజ్‌పేయి స్మృతి కేంద్రం సదవ్‌ అటల్‌ను సందర్శించిన నేతలు వాజ్‌పేయి జాతికి అందించిన సేవలను ప్రస్తుతించారు.

వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె నమితా కౌల్‌ భట్టాచార్య, మనవరాలు నిహారిక పలువురు బీజేపీ నేతలు, పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి దివంగత నేతకు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వాజ్‌పేయి తొలి వర్ధంతి పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top