'ప్రణీత దగ్గర సెల్ ఫోన్ లేదు' | Sakshi
Sakshi News home page

'ప్రణీత దగ్గర సెల్ ఫోన్ లేదు'

Published Mon, Jun 6 2016 7:47 PM

'ప్రణీత దగ్గర సెల్ ఫోన్ లేదు'

బెంగళూరు: జోధ్పూర్ నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని ప్రణీత మెహతా(21) మరణంపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. సముద్రపు అలకు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతే సెల్ఫీ తీసుకుంటూ ఆమె మృతి చెందిందని తప్పుగా రిపోర్ట్ చేసింది.  రాజస్థాన్ కు చెందిన ప్రణీత తన ఫ్రెండ్స్ తో కలిసి మే 29న కర్ణాటకలోని గోకర్ణ బీచ్ కు వచ్చింది. ఒడ్డున రాయిపై కూర్చునివున్న ఆమెను సముద్రపు అల లోపలకు లాక్కుపోయింది. దీంతో సముద్రంలో మునిగి ఆమె మృతి చెందింది.

300 అడుగుల లైట్ హౌస్ పైకిఎక్కి సెల్ఫీ తీసుకుంటూ ఆమె ప్రాణాలు కోల్పోయిందని మీడియాలో వచ్చింది. దీనిపై ప్రణీత స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ప్రణీత దగ్గర అసలు సెల్ ఫోనే లేదని, అందరి ఫోన్లు బ్యాగులోనే పెట్టామని ఆమె స్నేహితురాలు ప్రత్యూష మెహతా వెల్లడించింది. ప్రణీత ఫోను ఇప్పటికీ తన దగ్గరే ఉందని తెలిపింది. దీంతో మీడియా సంస్థలు లెంపలు వేసుకున్నాయి. ప్రణీత కుటుంబానికి క్షమాపణ చెప్పాయి.

Advertisement
Advertisement