కరడుగట్టిన తిరుగుబాటుదారుడు అరెస్టు | Kapai taken into Police Custody for 16 days | Sakshi
Sakshi News home page

కరడుగట్టిన తిరుగుబాటుదారుడు అరెస్టు

Nov 5 2015 7:53 PM | Updated on Aug 20 2018 4:27 PM

కరడుగట్టిన తిరుగుబాటుదారుడు సింగ్మాయోకపాయ్ని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గురువారం గువాహటి వద్ద అరెస్టు చేశారు.

గువాహటి: కరడుగట్టిన తిరుగుబాటుదారుడు సింగ్మాయోకపాయ్ని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గురువారం గువాహటి వద్ద అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న తుపి అనే గ్రామంలో దేశ భద్రతా బలగాలపై జరిగిన మెరుపుదాడిలో ఇతడిదే కీలక పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఆ దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో అతడిని ఎన్ఐఏ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. అనంతరం 16 రోజులపాటు పోలీసుల కస్టడీకి తరలించారు. ఖోన్సాలో ఏర్పడిన నేషనల్ సోషలిస్టు కైన్సిల్ ఆఫ్ నాగాలాండ్కు సింగ్మాయోకపాయ్ కెప్టెన్గా పనిచేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement