డెసిషన్‌ మీట్‌?

T2 ENTERTAINMENT ENTERTAINMENT  I am too shy to celebrate Valentine's Day, says Tiger Shroff - Sakshi

బాలీవుడ్‌ స్పైస్‌

బాలీవుడ్‌ యంగ్‌ లవ్‌ బర్డ్స్‌ అనగానే వినిపిస్తున్న పేర్లు టైగర్‌ ష్రాఫ్, దిశా పాట్నీ. వాళ్ల రిలేషన్‌షిప్‌ గురించి ప్రస్తావించిన ప్రతీసారి ఈ ఇద్దరూ ‘మేము క్లోజ్‌ ఫ్రెండ్స్‌’ అంటున్నారు తప్పితే తమ రిలేషన్‌ స్టేటస్‌ను రివీల్‌ చేయట్లేదు. కానీ.. కాఫీ షాపుల్లో, పార్టీల్లో, పబ్బుల్లో తరచూ కనిపిస్తూనే ఉందీ జంట. ఈ ప్రేమ జంట లవ్‌ను టైగర్‌ ష్రాఫ్‌ ఫ్యామిలీ కూడా ఓకే చేసినట్టు కనిపిస్తోంది.

ఇటీవల జరిగిన జాకీ ష్రాఫ్‌ 61వ బర్త్‌డే డిన్నర్‌ వేడుకల్లో టైగర్‌ ఫ్యామిలీతో దిశా కూడా పాల్గొన్నారట. పార్టీ జరిగిన తర్వాత రెస్టారెంట్‌ నుంచి టైగర్‌ ఫ్యామిలీతో కబుర్లు చెబుతూ బయటకు వస్తూ జనాల దృష్టిలో పడ్డారు దిశా. టైగర్‌ ష్రాఫ్‌ మదర్, సిస్టర్‌తో దిశా మంచి క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేశారని సమాచారం. ‘టైగర్‌– దిశా ప్రేమను టైగర్‌ ష్రాఫ్‌ ఫ్యామిలీ అంగీకరించలేదు’ అంటూ ఆ మధ్య వచ్చిన రూమర్స్‌ను కొట్టి పారేస్తున్నట్టుగా ఉంది ఈ డిన్నర్‌ మీట్‌.

తాజాగా వేలంటైన్స్‌ డే సందర్భంగా ‘డిన్నర్‌ మీట్‌’ని ప్లాన్‌ చేసుకున్నారు ఈ యంగ్‌ పెయిర్‌. చాటుమాటుగా డిన్నర్‌ కానించేద్దామనుకుని ఉంటారు కానీ ఈసారీ నలుగురి దృష్టిలో పడ్డారు. దాంతో ఫ్యామిలీ అంగీకారం వచ్చినట్టే అని కొంతమంది బలంగా ఫిక్సయ్యారు. మరి అధికారికంగా ఈ జోడీ తమ  ప్రేమను ఎప్పుడు ప్రకటిస్తారో? అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఈ డిన్నర్‌ మీట్‌నే డెసిషన్‌ మీట్‌లాగా తీసుకోవచ్చా? అంటే తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top